అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ నటించిన 'ధడక్‌' మూవీ వచ్చే నెలలో విడుదల కాబోతోంది. మరాఠీ సినిమా 'సైరాత్‌’ కి ఇది హిందీ రీమేక్‌. ఇప్పటికే ఈసినిమాకు సంబంధించిన జాన్వీ లిప్ లాక్ సీన్ సంచలనంగా మారింది. ఇషాన్‌ ఖత్తర్‌ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో జాన్వీ రొమాంటిక్ సీన్స్ లో తెగ రెచ్చిపోయి నటించింది అని బాలీవుడ్ మీడియా వార్తలు వ్రాస్తోంది. 
Presenting Janhvi Kapoor And Ishaan Khattar In Brand New Dhadak Poster
అయితే ఇక్కడ అసలు విషయం వేరు అని అంటున్నారు. శ్రీదేవి మరణం తర్వాత జాన్వీ కెమెరా ముందు డల్‌ అయిపోయిందని దీనితో ఆమెను రొమాంటిక్ సన్నివేశాలలో హుషారుగా నటించేలా జాన్వీని మార్చడానికి 'ధడక్‌' టీమ్‌ ఎంతో కష్టపడవలసి వచ్చింది అని తెలుస్తోంది. కపూర్‌ ఫ్యామిలీ నుంచి పలువురు ప్రముఖులు ఈమూవీ సెట్స్ పైకి వచ్చి జాన్వీని విపరీతంగా ప్రోత్సహించిన తరువాత మాత్రమే జాన్వీ తన బాధను మర్చిపోయి ఇలా రెచ్చిపోయి లిప్ లాక్ సన్నివేశంలో నటించింది అని అంటున్నారు. 
Ishaan Khatter, Jhanvi Kapoor
అయితే ఇప్పుడు ఈ లిప్ లాక్ సన్నివేసం పై విపరీతమైన విమర్శలు వస్తున్న నేపధ్యంలో ఈ విషయమై జాన్వీ చాల ధైర్యంగా స్పందించింది. ఈమూవీలో లిప్ లాక్ సన్నివేశం ఉన్నమాట వాస్తవమే అయినా ఆ సన్నివేశం చిత్రీకరిస్తున్నప్పుడు కొన్ని టెక్నిక్స్ ను వాడారని ఆ విషయాలు తెలుసుకోకుండా తన పై విమర్శలు చేయడం అన్యాయం అంటూ జాన్వీ కామెంట్స్ చేసింది. 
Janhvi Kapoor will have a sultry solo dance sequence in Dhadak
ఇక లిప్ లాక్ సీన్స్ కు తాను వ్యతిరేకమా అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ అసలు సినిమాలో ఏముందో తెలుసుకోకుండా సినిమా రిలీజ్‌ కాకముందే వివాదాలు సృష్టించడం సబబు కాదు అంటూ కామెంట్స్ చేసింది. ముఖ్యంగా ఈమూవీకి సంబంధించి మీడియాను ఫేస్ చేయడంలో జాన్వీ కపూర్‌ అనుసరిస్తున్న ధైర్యాన్ని చూసి బాలీవుడ్ మీడియా ఆశ్చర్యపోతోందని టాక్. దీనితో ‘ధడక్’ విజయవంతం అయితే ఇక జాన్వీకి ఎదురుండదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: