గత కొంత కాలంగా టాలీవుడ్ ఇండస్ట్రీకి బ్యాడ్ టైమ్ నడుస్తుందనే చెప్పొచ్చు.  గత సంవత్సరం టాలీవుడ్ లో డ్రగ్స్ కలకలం రేపింది.  అన్ని ఇండస్ట్రీల దృష్టి తెలుగు ఇండస్ట్రీ వైపు పడటం..చాలా ఇబ్బంది పడ్డారు.  తాజాగా మరో దారుణమైన విషయం వెలుగులోకి వచ్చింది.   అమెరికాలో టాలీవుడ్ సెక్స్ రాకెట్ గుట్టు బయట పెట్టారు అక్కడి పోలీసులు.  తాజాగా దీనిపై యాంకర్ లాస్య స్పందించారు. టాలీవుడ్ సెక్స్ రాకెట్‌పై యాంకర్ లాస్య సంచలన వ్యాఖ్యలు చేసింది. కాస్టింగ్ కౌచ్ విషయాలు వెలుగులోకి వచ్చినట్టుగానే అమెరికాలో జరుగుతున్న సెక్స్ రాకెట్ గుట్టు కూడా బయటకు వస్తే బాగుంటుందని భావించానని ఆమె తెలిపింది.
Image result for ANCHOR LASYA
టాలీవుడ్‌లో ‘కమిట్‌మెంట్’ అడిగినట్టుగానే.. అమెరికాలో ‘షాపింగ్‌’కి ఒప్పుకొంటారా? అని అడుగుతారని లాస్య చెప్పింది. షాపింగ్‌కి ఓకే అంటే అన్నింటికీ ఓకే చెప్పినట్టేనని ఆమె తెలిపింది.  పద్ధతిగా సంప్రదాయబద్ధంగా ఉన్న వాళ్లను కూడా అడుగుతున్నారని లాస్య వాపోయింది. నాకు తెలిసిన పెద్ద ఆర్టిస్ట్ ఇలా అమెరికా వెళ్లి బాగా సంపాదించానని చెప్పుకొంది. ప్రస్తుతం ఆవిడ సినిమాల్లో పెద్ద హీరోయిన్‌గా సెకండ్ హీరోయిన్‌గా చేస్తోంది.
Image result for ANCHOR LASYA
నెల రోజుల్లోనే రూ.80 లక్షలు సంపాదించుకున్నానని గర్వంగా చెప్పుకొంది. న్యూజెర్సీకి చెందిన ఒకాయన పెద్ద పెద్ద ఆర్టిస్టులతో ఫేస్‌బుక్‌లతో ఫొటోలు, వీడియోలు దిగి పెడతాడు. పెద్ద పెద్ద యాంకర్లతో పడుకున్నానని నాతో చెప్పాడు. నువ్వుంత ఆఫ్ట్రాల్. నా దగ్గరికి రాకపోతే అమెరికాలో నువ్వెప్పుడూ స్టేజి ఎక్కలేవు అని నన్ను బెదిరించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంత వరకూ ఒక్క ఈవెంట్‌కు వెళ్లలేదు. ఇలాంటి బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ వల్ల ఈవెంట్లలో పాల్గొనట్లేద ని లాస్య చెప్పుకొచ్చింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: