ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో మౌనంగా ఉంటున్న రేణు దేశాయ్ ఒకేసారి ఎవరూ ఊహించని షాక్ ఇచ్చింది. కొంతకాలం క్రితం ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు మళ్ళీ పెళ్లి చేసుకునే ఆలోచనలు వస్తున్నాయి అంటూ తన అభిప్రాయాలను లీక్ చేసిన విషయం తెలిసిందే. తన ఆలోచనలకు పవన్ సపోర్ట్ కూడ ఉంది అంటూ ఆమె ఆ ఇంటర్వ్యూలో చెప్పింది. 
Renu Desai in Neethone Dance
ఈ నేపధ్యంలో లేటెస్ట్ గా ఈమె సోషల్ మీడియాలో చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఈ కామెంట్స్ చూశాక  ఎవరైనా ఆమె త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు అభిప్రాయపడతారు. నిన్న రేణుదేశాయ్ ఇన్ స్టాగ్రామ్ లో ఓ ఫొటోను పోస్టు చేసింది. 
Star MAA Neethone Dance Judge Renu Desai
ఓ వ్యక్తి చేయి పట్టుకొని ఉన్న మహిళ ఫొటో అవ్వడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాదు ఆ వ్యక్తి గురించి వివరిస్తూ ఓ కవితను కూడా రేణుదేశాయ్ పోస్టు చేయడంతో మరింత సంచలనమైంది. అయితే రేణుదేశాయ్ చేయిపట్టుకున్న వ్యక్తి ఎవరనేది ఆమె బయటపెట్టలేదు. 
Renu Desai
కేవలం అతని వ్యక్తిత్వాన్ని మాత్రమే కవితరూపంలో తెలిపింది. ‘ప్రేమ కోసం నేను ఎక్కడెక్కడో వెతికాను. కవితలోనే అది దొరుకుతుందని భావించాను. కొన్ని సార్లు క్యాండిలైట్ డిన్నర్లు మరికొన్నిసార్లు తీపి అబద్దాలు ఎప్పటికి గుర్తుండిపోతాయి’ అంటూ రేణు కవితాత్మకంగా చెప్పింది. ఇది చాలదు అన్నట్లుగా ‘నీ నిజాయితీ - నీ మాటల్లో నాకు ప్రేమ దొరికింది. నా చెయ్యి పట్టుకో.. ఎప్పటికీ వదిలి వెళ్లకు. నాలో నువ్వు ఆ నమ్మకాన్ని కల్పించావు’ అంటూ తన కవితను ముగించింది రేణు దేశాయ్. దీనితో రేణు షేర్ చేసిన ఆఫోటోలోని అజ్ఞాత వ్యక్తి ఎవరు ? అన్న విషయమై పవన్ అభిమానులలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. మరి కొందరైతే ఆమె మళ్ళీ పెళ్లి చేసుకోబోతోంది అని భావించి ఆమెకు శుభాకాంక్షలు కూడ చెపుతున్నారు. అయితే ఈవిషయాలకు స్పందించడం మొదలు పెట్టలేదు రేణు దేశాయ్..  


మరింత సమాచారం తెలుసుకోండి: