చిన్న హీరోల సినిమాలు ఏమాత్రం విజయం సాధించినా ఆసినిమాల నటీనటులను దర్శక నిర్మాతలను తన ఇంటికి పిలిచి అభినందించి గౌరవించడం చిరంజీవి అలవాటు. తాను మెగా హీరోగా ఎదగని రోజులలో తన సినిమాలు విజయవంతం అయినా తన పై అప్పటి టాప్ హీరోలు ఎవరూ ప్రశంసించలేదు అన్న బాధ చిరంజీవిలో ఉన్న నేపధ్యంలో అలనాటి బాథను ఇప్పుడు గుర్తుకు తెచ్చుకుంటూ యంగ్ హీరోలను ప్రశంసించి సత్కరించడం ఒక అలవాటుగా మార్చుకున్నాడు చిరంజీవి.
Chiranjeevi In Kaththi Beard @ Sardaar Audio Function
గతవారం విడుదలైన ‘సమ్మోహనం’ సక్సస్ అయిన నేపధ్యంలో ఆమూవీ హీరో సుధీర్ బాబును అదేవిధంగా ఆమూవీ దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణను మిగతావారిని పిలిచి చిరంజీవి తన ఇంటిలో వారిని అభినందించడమే కాకుండా వారికి చిరు సత్కారాలు చేసాడు. ఇప్పుడు ఆ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు మీడియాకు లీక్ కావడంతో మళ్ళీ చిరంజీవికి ఏమైంది అంటూ చర్చలు జరుగుతున్నాయి. 
Chiranjeevi. Image from Twitter/@ChiruFanClub
మీడియాకు లీక్ అయిన ఈ ఫోటోలలో చిరంజీవి మళ్ళీ బాగా లావుగా కనిపించడమే కాకుండా బుగ్గలు బాగా ఊరి ఉన్నాయి. చిరంజీవి మొహంలో గ్లో కూడ తక్కువగా కనిపించడంతో చిరంజీవికి ఏమైంది అంటూ చర్చలు మొదలయ్యాయి. ఈమధ్య చిరంజీవి తన భుజానికి సంబంధించిన ఒక సమస్యకు డాక్టర్ల సలహా మేరకు సర్జరీ చేయించుకున్నాడు అని వార్తలు వచ్చాయి. 
Chiranjeevi seems to have chosen a new look for his latest movie.
ఈ సర్జరీ వల్ల చిరంజీవిని కొన్ని వారాలపాటు జిమ్ వైపు వెళ్ళవద్దని డాక్టర్లు సలహా ఇచ్చినట్లు టాక్. ప్రతిరోజు గంటల తరబడి వ్యాయామం చేస్తూ తన శరీరాన్ని ఫిట్ గా పెట్టుకుని చిరంజీవి తన జిమ్ కు దూరం కావడం వల్ల ఇలా మారిపోయాడ ? లేకుంటే సహజంగా వచ్చే వయస్సులోని మార్పులా అని చర్చలు జరుగుతున్నాయి. ‘సైరా’ సినిమా కోసం తన బాడీని చాల ఫిట్ గా మార్చుకున్న చిరంజీవి బాడీలో మార్పులు రావడంతో ‘సైరా’ షూటింగ్ మరింత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది..   


మరింత సమాచారం తెలుసుకోండి: