ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్ల జోరు బాగా పెరిగిపోయింది.  ఒకప్పుడు రాజబాబు, పద్మనాభం, చలం లాంటి వారు కమెడియన్లు గా నటిస్తూనే హీరోగా కొన్ని చిత్రాల్లో నటించి మెప్పించారు.  ఆ తర్వాత బ్రహ్మానందం, ఆలీ వంటి కమెడియన్లు హీరోగాలుగా కొన్ని చిత్రాల్లో నటించారు.  ప్రస్తుతం సునీల్,  సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి లాంటి వారు కమెడియన్స్ గానే కాకుండా హీరోలుగా రాణిస్తున్నారు.  తాజాగా ఇదే బాట పట్టారు ‘జబర్ధస్త్ ’ ఫేమ్ ష‌క‌ల‌క శంక‌ర్‌. 
Image result for షకలక శంకర్
ష‌క‌ల‌క శంక‌ర్‌ని హీరోగా, శ్రీధ‌ర్‌ను ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ ఆర్. ఆర్. పిక్చ‌ర్స్ సంస్థ, ఎస్.కె. పిక్చ‌ర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో వై. ర‌మ‌ణారెడ్డి, సురేష్ కొండేటి సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్ర‌మిది.  కామెడీ, సెంటిమెంట్ ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయని..షకలక శంకర్ అద్బుతమైన నటన కనబరిచారని నిర్మాణ  ర‌మ‌ణారెడ్డి అన్నారు.
Shambo Shankara set to release on June 29th
టీజ‌ర్‌ 50లక్షల వ్యూస్ వైపు దూసుకెళుతోంది. ఒక స్టార్ హీరో టీజ‌ర్‌కి త‌గ్గ‌ని ధ‌మాకా రిజ‌ల్ట్‌ ఇది. దిల్‌రాజు వంటి అగ్ర‌నిర్మాత కం పంపిణీదారుడు ఈ సినిమా టీజ‌ర్‌ని ప్ర‌శంసించారంటే ఫ‌లితం ముంద‌స్తుగానే ఊహించ‌వ‌చ్చు.మ‌రో నిర్మాత‌ సురేష్ కొండేటి మాట్లాడుతూ -ష‌క‌ల‌క శంక‌ర్ క‌థానాయ‌కుడిగానూ నిరూపించుకునే ప్ర‌య‌త్న‌మిది. తొలి ప్ర‌య‌త్న‌మే పెద్ద స‌క్సెస్ అవుతాడ‌న్న ధీమా ఉంది. టీజ‌ర్‌కి వ‌చ్చిన హైప్ దృష్ట్యా ఈ చిత్రాన్ని అత్యంత ఘ‌నంగా రిలీజ్ చేస్తున్నాం.

29న రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. షకలక శంక‌ర్, కారుణ్య, నాగినీడు, అజ‌య్ ఘోష్, ర‌వి ప్రకాష్, ప్ర‌భు, ఏడిద శ్రీరామ్ త‌దిత‌రులు న‌టించారు. ఈ చిత్రానికి కెమెరా: రాజ‌శేఖ‌ర్, సంగీతం: సాయి కార్తిక్, ఎడిటింగ్: ఛోటా.కె. ప్ర‌సాద్, నిర్మ‌తలు: వై. ర‌మ‌ణారెడ్డి, సురేష్ కొండేటి, క‌థ‌, స్ర్కీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: శ్రీధ‌ర్. ఎన్.


మరింత సమాచారం తెలుసుకోండి: