మరో ఆరు నెలలలో తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి రాబోతోంది. సంక్రాంతి అనగానే కోడి పందాలు ముగ్గులతోపాటు సంక్రాంతి సినిమాల హడావిడి కూడ కనిపిస్తుంది. సంక్రాంతిని టార్గెట్ చేస్తూ కనీసం ఇద్దరు ముగ్గురు టాప్ హీరోలు పోటీపడటం సర్వసాధారణం. 
NTR biopic
ఇలాంటి పరిస్తుతులలో వచ్చే ఏడాదిలో మొదటిగా రాబోతున్న సంక్రాంతి రేస్ కు బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ అదేవిధంగా చరణ్ బోయపాటిల కాంబినేషన్ లో శరవేగంగా రూపొందుతున్న మూవీల మధ్య పోటీ ఉంటుంది అని భావించారు అంతా. ఎన్టీఆర్ బయోపిక్ లో సంచలనాలు ఉండవు కాబట్టి అది కేవలం నందమూరి అభిమానులకు మాత్రమే ఎన్టీఆర్ బయోపిక్ నచ్చే ఆస్కారం ఉంది. ఇలాంటి పరిస్థుతులలో భారీ బడ్జెట్ తో తీస్తున్న చరణ్ బోయపాటి మూవీకి అత్యంత భారీ కలక్షన్స్ రావడమే కాకుండా ఈమూవీ బిజినెస్ కూడ చాల భారీ స్థాయిలో జరిగే ఆస్కారం కనిపించింది. 

ఈమూవీతో పోటీపడే టాప్ హీరోల సినిమాలు ఏమి లేకపోవడంతో సంక్రాంతి రేస్ లో చరణ్ ఏకచత్రాధిపత్యం కొనసాగుతుంది అని భావించారు అంతా. అయితే ఇప్పుడు ఈ ఆలోచనలకు మహేష్ చెక్ పెడుతున్నట్లు తెలుస్తోంది. తెలుస్తున్న సమాచారంమేరకు నిన్న మహేష్ వంశీ పైడిపల్లిల కాంబినేషన్ లో డెహ్రాడూన్ లో ప్రారంభమైన మూవీ షూటింగ్ 4 నెలల్లో పూర్తిచేసి రాబోయే సంక్రాంతి రేస్ కు రెడీ పెట్టాలని మహేష్ గట్టిపట్టుదల పై ఉన్నట్లు సమాచారం. 
mahesh babu, mahesh babu films, mahesh babu vamsi paidipally, vamsi paidipally twitter, mahesh babu vamsi film, mahesh babu film news, tollywood news, entertainment news
‘భరత్ అనే నేను’ సక్సస్ తరువాత మహేష్ నటిస్తున్న మూవీకాబట్టి ఈమూవీకి వచ్చే కలక్షన్స్ మహేష్ కెరియర్ కు అత్యంత కీలకంగా మారాయి. ఇలాంటి పరిస్థుతులలో తన క్రేజ్ కు సంక్రాంతి మ్యానియా కూడ తోడైతే మరింత భారీ కలక్షన్స్ సాధించవచ్చని మహేష్ ఆలోచన అని అంటున్నారు. ఈవార్తలే నిజం అయితే రాబోతున్న సంక్రాంతికి బాలకృష్ణ చరణ్ మహేష్ ల మధ్య భారీ పోటీ ఉంటుంది అనుకోవాలి..   



మరింత సమాచారం తెలుసుకోండి: