ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీని డ్రగ్స్ మాఫియా వెంటాడితే..ఇప్పుడు సెక్స్ రాకెట్ ఇరుకున పెడుతుంది.  అమెరికాలోని చికాగో కేంద్రంగా తెలుగు దంపతులు మోదుగుమూడి కిషన్- చంద్రకళ నడిపిస్తున్న సెక్స్ రాకెట్ భాగోతం బయటపడిన తర్వాత పలు సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.  కిషన్ దంపతులు అమెరికాలో తెలుగు ఈవెంట్ల పేరుతో ఇక్కడకు హీరోయిన్లను రప్పించి గత కొన్నేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారు.   అయితే ప్రస్తుతం వ్యభిచార దందాలో ఆరుగురి పేర్లు బయటకు వచ్చాయని, వీరిని సాక్షులుగా పేర్కొంటామని చెప్పిన అధికారులు, కిషన్ దంపతుల ఫోన్లను విశ్లేషిస్తున్నామని చెప్పారు.
romance
ఈ సంవత్సరం జనవరిలో కిషన్ దంపతులను యునైటెడ్ స్టేట్స్ బోర్డర్ పెట్రోల్ సిబ్బంది, అక్రమంగా నివసిస్తున్న ఆరోపణలపై అరెస్ట్ చేయగా, ఫిబ్రవరి 23న వారు బయటకు వచ్చారు. కానీ ఇద్దరినీ అరెస్ట్ చేసిన సమయంలో వారి నుంచి అధికారులు కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకోగా కొన్ని పేపర్లలో కీలక సమాచారం లభ్యం అయినట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా ఈ  వ్యహారంలో బాధితురాలుగా ఉన్న హీరోయిన్ (విక్టిమ్-ఎ)పై అమెరికా ఐదేళ్ల నిషేధం విధించినట్లు సమాచారం.   
బ్యాన్ ఎత్తివేయాలని విన్నపం
విక్టిమ్-ఎగా ఉన్న సదరు హీరోయిన్ తెలుగు, కన్నడ చిత్రాల్లో నటించింది. హైదరాబాద్‌లో ఉన్న సదరు హీరోయిన్‌ను యూఎస్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్ అధికారులు సెక్స్ రాకెట్‌ విషయంలో ప్రశ్నించినట్లు తెలుస్తోంది. విచారణకు ఆమె తన లాయర్‌తో కలిసి హాజరైనట్లు సమాచారం.విచారణ సందర్భంగా తనపై బ్యాన్ ఎత్తివేయాలని సదరు హీరోయిన్ అధికారులను వేడుకున్నట్లు సమాచారం. అయితే ఈ విషయం తమ చేతుల్లో ఉండదని వారు చెప్పినట్లు తెలుస్తోంది. 
Image result for అమెరికా సెక్స్ రాకెట్
కాకపోతే ఈ కేసులో ఆమె పేరును బయటకు రానివ్వకుండా చూస్తామని వారు హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక సెక్స్ రాకెట్ ఎఫెక్ట్ తెలుగు హీరోయిన్లకు శాపంగా మారింది.    అధికారులు ఎయిర్‌పోర్టులోనే వారిని నిలువరించి గంటల తరబడి ప్రశ్నిస్తున్నారు. ఇటీవల మెహ్రీన్‌కు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది.ఈ సెక్స్ రాకెట్ కేసును అమెరికా పోలీసులు సీరియస్‌గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందుతులు కిషన్ మోదుగుమూడి, చంద్రకళ దంపతులను ఇప్పటికే అరెస్ట్ చేసి ఇల్లినాయిస్ కోర్టులో ప్రవేశ పెట్టిన అధికారులు వివిధ కోణాల్లో విచారణ జరుపుతున్నారు.
Image result for అమెరికా సెక్స్ రాకెట్
మరోవైపు చికాగో సెక్స్ రాకెట్‌కు సంబంధించిన కేసును తాము విచారించడం లేదని తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డి ఓ ఆంగ్లమీడియాతో తెలిపారు. దీన్ని బట్టి తెలంగాణ పోలీసులతో సంబంధం లేకుండా అమెరికా పోలీసులు హైదరాబాద్‌లో తమ విచారణ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: