ప్రముఖ నటుడు, బీజేపీ రాజ్యసభ సభ్యుడు సురేష్ గోపీ, నటి అమలా పాల్‌పై చార్జిషీట్ నమోదు చేసేందుకు కేరళ పోలీసులు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు.  సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలం అంటూ తాము ఏం చేసినా చెల్లు బాటు అవుతుందన్న విషయంలో వీరు ఖరీదైన కార్లు కొనుగోలు చేసిన ఈ ఇద్దరు సినీ ప్రముఖులు తప్పుడు అడ్రస్‌ల పేరిట పుదుచ్చేరిలో కార్ల రిజిస్ట్రేషన్ చేయించి ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నును ఎగ్గొట్టారు.  కాగా,  నకిలీ అడ్రస్‌తో కోటి రూపాయల విలువ చేసే కారును పుదుచ్చేరిలో అమలాపాల్‌ రిజిస్ట్రేషన్‌ చేయించారు.

దీంతో కేరళ ప్రభుత్వానికి ఆమె రూ. 20 లక్షల పన్ను ఎగవేశారన్నది అబియోగంగా ఉంది. కేరళ ప్రబుత్వం క్రైమ్‌ బ్రాంచ్‌ తో విచారణ చేయించింది.  అయితే సీనియర్‌ నటుడు సురేష్‌ గోపీ, మరో హీరో పహద్‌ ఫజిల్‌ కూడా ఇదే తరహాలో పన్ను ఎగ్గొట్టారని తేలింది. దీంతో క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు పక్కా ఆధారాలతో వారిపై కేసు నమోదు చేశారు.  ఈ కేసు కోర్టులో విచారణ కొనసాగుతుండగానే.. ప్రభుత్వం వారికి పన్నులు చెల్లించేందుకు మరో అవకాశం కల్పించింది.
Related image
ఇక ఫహద్‌ పన్ను చెల్లించటంతో అతనిపై కేసును ఉపసంహరించుకున్నారు. గతంలో ఇదే కేసులో కోర్టు ధిక్కారానికి పాల్పడి, కోర్టు ఆగ్రహానికి గురైన అమలాపాల్ ఆ తర్వాత కోర్టులో లొంగిపోయి, వెంటనే బెయిల్‌పై బయటికొచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులోనే ఈ ఇద్దరు పన్ను ఎగవేతదారులపై ఛార్జ్‌షీట్‌ నమోదు చేయాల్సిందిగా కేరళ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు చట్టరీత్యా చర్యలకు ఉపక్రమిస్తున్నట్టు సమాచారం. 



మరింత సమాచారం తెలుసుకోండి: