గత కొంత కాలంగా సినిమా ఇండస్ట్రీ ఎక్కువ శాతం అమెరికా చుట్టూ తిరుగుతూ ఉండేది...స్టార్ హీరో..బడ్జెట్ కాస్త పెద్దదైతే అమెరికా ట్రిప్ కొట్టి రావాల్సిందే..అక్కడ లోకేషన్లు చాలా అద్భుతంగా ఉంటాయి.   మినిమం బడ్జెట్ చిత్రాలు సైతం అమెరికాలో షూట్ చేసేందుకు ఇష్టపడుతుంటాయి. కానీ ఇప్పుడు అమెరికా షూట్ అంటేనే వణికిపోతున్నారు..ఈ మద్య చికాగో సెక్స్ రాకెట్ ప్రకంపనలు రేపుతున్న విషయం తెలిసిందే.  అమెరికాలో తెలుగు దంపతులు మోదుగుమూడి కిషన్, చంద్రకళ నడిపిస్తున్న వ్యభిచారం ఉదంతం వెలుగులోకి రావడంతో చిత్రసీమ మరోసారి కలవరపాటుకి గురైంది.
Image result for chicago sex racket
సెక్స్‌ రాకెట్‌ గుట్టు రట్టయినప్పటి నుంచి అమెరికా పోలీసులు సినిమా తారలు, సినిమాలతో సంబంధం ఉన్నవారిపై ప్రత్యేక దృష్టి పెట్టారు.  గతంలో జరిగిన కార్యక్రమాలు, అందులో పాల్గొన్న నటీమణుల గురించి కూడా ఆరా తీస్తున్నారు. దీంతో ఆ చీకటి బాగోతంతో సంబంధం ఉన్న తారలతో పాటు ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లొచ్చిన వారు కూడా హడలిపోతున్నారు. 
Image result for chicago sex racket
ఈ మద్య అమెరికా వెళ్లిన మెహ్రిన్ కౌర్ ని చాలా సమయం వరకు యక్ష ప్రశ్నలు అడి చాలా ఇబ్బంది పెట్టారు.. సుదీర్ఘ విచారణ అనంతరం ఆమె ప్రయాణాలన్నీ షూటింగ్‌ల కోసమే అని తేలడంతో వదిలిపెట్టినట్టు తెలుస్తోంది. ఈ ఉదంతంతో ఇంతకుముందు అమెరికాలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు, స్టేజి షోలు, చిత్రీకరణలకు ఉత్సాహంగా వెళ్లే తెలుగు తారలు ఇప్పుడు విదేశాల మాటెత్తితేనే హడలిపోతున్నారు.  ఇన్నాళ్లూ స్వేచ్ఛగా అమెరికా తదితర దేశాలకు వెళ్లి వచ్చే తారలకు ఇకపై ఆ పరిస్థితి ఉండదేమో అనే సందిగ్ధ పరిస్థితి ఏర్పడింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: