ఈ మద్య తమిళ ఇండస్ట్రీలో యువ హీరోల హవా కొనసాగుతుంది.  అయితే ఎంత మంది హీరోలు ఉన్నా..తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు జయం రవి. తెలుగు సినిమా జ‌యం రీమేక్‌తో త‌మిళంలో బ్లాక్‌బ‌స్ట‌ర్ హీరోగా వెలిగిపోయిన ర‌వి .... జ‌యం ర‌విగా మారాడు. ఆ త‌ర‌వాత అత‌డు ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించాడు. ఇటీవ‌లే త‌ని ఒరువ‌న్ (ధ్రువ‌-తెలుగు) చిత్రంతో మిరాకిల్ అనిపించే విజ‌యం అందుకున్నాడు. 
Image result for jayam ravi tik tik tik telugu
జ‌యం ర‌వి, నివేదా పేతురాజ్ హీరో హీరోయిన్లుగా చ‌ద‌ల‌వాడ బ్ర‌ద‌ర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర ఫిలింస్ బ్యాన‌ర్‌పై శ‌క్తి సౌంద‌ర్ రాజ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌ద్మావ‌తి చ‌ద‌ల‌వాడ నిర్మాతగా వ‌స్తోన్న చిత్రం ‘టిక్ టిక్ టిక్‌’. ఇండియ‌న్ సినిమా చ‌రిత్రలో తొలి అంత‌రిక్ష సినిమాగా ఈ సినిమా తెరకెక్క‌డం విశేషం. జూన్ 22న ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు, త‌మిళంలో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు.
Image result for jayam ravi tik tik tik telugu
ఈ సినిమా ఈపాటికే రిలీజ్ కావాల్సి ఉన్నా ర‌క‌ర‌కాల కారణాల‌తో వాయిదా ప‌డింది. మ‌ధ్య‌లో జ‌బ‌క్ బ్ర‌ద‌ర్స్(నిర్మాత‌లు)ని ఆర్థిక క‌ష్టాలు ఉక్కిరిబిక్కిరి చేశాయి. మొత్తానికి జ‌యం ర‌వి సినిమా ఎన్నో అవాంత‌రాల మ‌ధ్య, ఆర్థిక క‌ష్టాల మ‌ధ్య‌ తెర‌కెక్కి ఎట్ట‌కేల‌కు రిలీజ‌వుతోంది. 
Image result for jayam ravi tik tik tik telugu
ఇప్ప‌టికే ప్రోమోలు ఆక‌ట్టుకున్నాయి. ఈ సినిమా రిలీజైతే అంత‌రిక్షం నేప‌థ్యంలో తొలి సౌత్ సినిమా, తొలి ఇండియ‌న్ సినిమా ఇదే అవుతుంది. త‌దుప‌రి వ‌రుణ్ తేజ్‌-సంక‌ల్ప్ స్పేస్ సినిమా బృహ‌త్త‌ర ప్ర‌య‌త్నానికి ఈ సినిమా విజ‌యం ప్రోత్సాహ‌క‌రంగా ఉంటుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: