తెలుగు టెలివిజన్ సెట్స్ లో బిగ్ బాస్ రియాల్టీ షోకి మంచి ఆదరణ లభించింది.   సీజన్ వన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు.  అయితే రెండో సీజన్ లో కూడా ఎన్టీఆర్ ఆగమనం ఉంటుందని అనుకున్నారు..కానీ ఎన్టీఆర్ ఇప్పుడు షూటింగ్ బిజీలో ఉన్నాడు..దాంతో బిగ్ బాస్ సీజన్ 2 కి నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.  మాస్ ఇమేజ్ తో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించిన నాని బిగ్ బాస్ 2 సీజన్ ఎలా రక్తి కట్టిస్తారని మొదటి నుంచి రక రకాల అనుమానాలు వచ్చాయి.  అయితే ప్రోమోలో బిగ్ బాస్ 2 ఈ సారి ‘కొంచెం మసాలా ఎక్కువ’ అనే ట్యాగ్‌లైన్‌తో సందడి చేశాడు నాని. 
Related image
కానీ ఇప్పుడు ఆ మసాలా డోస్ ఏమాత్రం సరిపోలేదంటున్నారు..టీఆర్పీ రేటింగ్స్ వాళ్లు. తెలుగు టీవీ టీఆర్పీల్లో బిగ్‌బాస్ వెనుకబడిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. నాని హోస్టుగా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమం తొలి సీజన్‌లా దూసుకుపోవడం లేదనే రివ్యూలు వస్తున్నాయిప్పుడు.   బిగ్ బాస్ సీజన్ 1 లో ఎంట్రీ ఇచ్చిన సభ్యులు మొదట సింపుల్ గా ఉన్నా తర్వాత వారి సందడి తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.  ఇక ఎన్టీఆర్ శని, ఆదివారాల్లో తన పవర్ ఏంటో చూపించాడు. 
Image result for big boss 2 telugu
అయితే మొదటి సీజన్ లో సెలబ్రెటీల మాదిరిగా రెండో సీజన్ లో కూడా మంచి ఎంట్రటైన్ ఉంటుందని భావించిన జనాలకు హౌజ్ సభ్యులు పెద్దగా రంజింప చేయలేక పోతున్నారని టాక్ వస్తుంది. తొలి సీజన్‌తో పోలిస్తే మాత్రం.. అంత సీన్ లేదు బాస్.. అని ఈ కార్యక్రమాన్ని రివ్యూ చేస్తున్న వాళ్లు అంటున్నారు. ముందు ముందు మాసాలా ఘాటు పెరిగి, ఈ కార్యక్రమం ప్రేక్షకులను మరింతగా ఎంటర్‌టైన్ చేస్తుందేమో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: