తెలుగు ఇండస్ట్రీలో ‘నచ్చావులే’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అందాల భామ మాదవీలత  అందం, అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.  చేసింది తక్కువ చిత్రాలే అయినా..ఈ అమ్మడు గత కొంత కాలంగా పలు సంచలన విషయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.  అయితే ఆ సక్సెస్ ని క్యాష్ చేసుకోలేక పోయింది ఈ హాట్ భామ . నచ్చావులే వంటి సూపర్ హిట్ తర్వాత సరైన ప్రాజెక్ట్ ని ఎంచుకోలేకపోవడంతో వరుస ప్లాప్ లు వచ్చి పడ్డాయి దాంతో కెరీర్ లేకుండాపోయింది. 

అయితే ఇండస్ట్రీలో బలంగా నాటుకుపోయిన కాస్టింగ్ కౌచ్ సంస్కృతి ఆమెలాంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్లకు అవకాశాలు రాకుండా చేసింది. కోరికలు తీరిస్తేనే ఛాన్స్ ఇస్తామనే హీరోలు, నిర్మాతలు, డైరెక్టర్లు మాధవీలతకు ఎంతో మంది ఎదురయ్యారు. అయితే ఆమె తన వ్యక్తిత్వాన్ని చంపుకోకుండా అలాంటి వాటిని సున్నితంగా తిరస్కరించింది. దీంతో ఎన్నో మంచి ఆఫర్లు కోల్పోయానని ప్రతి చర్చాకార్యక్రమంలోనూ ఆన ఆవేదన వ్యక్తం చేసింది. ఇటీవల అమెరికాలో బ్లాస్ట్ అయిన టాలీవుడ్ సెక్స్‌రాకెట్‌కు లింక్ పెడుతూ వార్తలు వస్తున్నాయి. 
Image result for మాధవీలత
ఈ సెక్స్ రాకెట్ గురించి కూడా స్పందించింది. గత ఏడాది అమెరికా వెళ్లిన నేపథ్యంలో తనకు ఎదురైన అనుభవాన్ని మాధవీలత వివరించింది. తాను 2017 లో ఓ ఈవెంట్ కోసం అమెరికాకు వెళ్లానని మాధవీలత తెలిపింది. ఈవెంట్ కోఆర్డినేటర్లుగా కిషన్, చంద్ర ఉన్నారని తెలిపింది. అక్కడ జరుగుతున్న పరిణామాల అనుమానంగా ఉండడంతో తన జాగ్రత్తల్లో తాను ఉన్నానని మాధవీలత తెలిపింది. 
Image result for మాధవీలత
చికాగో సెక్స్ రాకెట్ లో ఇరుక్కున్న హీరోయిన్లు, ఇతర అమ్మాయిలదే తప్పు అనే ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారని మాధవీలత మండిపడింది. హీరోయిన్లు డాలర్స్ సంపాదించుకునే ఉద్దేశంతో, పరస్పర అవగాహనతోనే వెళుతున్నారనే ముద్ర వేస్తున్నారు. ఇక ఇప్పుడేమో అమెరికాలో సెక్స్ రాకెట్ దొరికిపోవడంతో కాబోలు సినిమా రంగంలో ఉన్నవాళ్ళని చంపేస్తా అంటూ వ్యాఖ్యానిస్తోంది . మాధవీలత అంటున్న మాటల్లో ఏదో గూఢార్థం ఉంది అయితే ఆ విషయం ఆమెకే తెలియాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: