తెలుగు ఇండస్ట్రీలో  బ్రది చిత్రంతో ఇద్దరు ప్రేమించుకొని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు సంతానం..అఖిరా, ఆద్య.  కొంత కాలం తర్వాత ఇద్దరి మద్య బేదాభిప్రాయలతో విడిపోయి విడాకులు కూడా తీసుకున్నారు.  అయితే పవన్ కళ్యాన్ మాత్రం తన మాజీ భార్య రేణు దేశాయ్ ని ఒక స్నేహితురాలిగా చూస్తున్నారు.

తన సంతానం విషయంలో ఏ లోటు లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అయితే ఈ మద్య రేణు దేశాయ్ మరో పెళ్లి చేసుకోబోతుందని వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఆమద్య  ఓ వ్యక్తి చెయ్యి పట్టుకుని ఉన్న ఫొటోను పోస్టు చేస్తూ, "నీతో ఉంటే సంతోషంగా, శాంతంగా ఉంటుంది. నా చెయ్యి ఎప్పటికీ విడువకు. ఆ నమ్మకాన్ని నువ్వు నాకు కల్పించావు" అని సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టిన పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్.

తాజాగా తన వివాహం అతనితోనేనని చెప్పకనే చెప్పింది. ఇదిలా ఉంటే ఈ అమ్మడు స్విమ్ సూట్ లో ఉన్న తను ఫోన్ లో మెసేజ్ లు చూస్తూ, ముసిముసి నవ్వులు నవ్వుతుండగా, స్నేహితులు తీసిన ఫొటోను అభిమానులతో పంచుకున్న ఆమె, తన కాబోయే భర్త ఇచ్చే మెసేజ్ లను చదివే ప్రైవసీ కూడా తనకు కలగట్లేదని చెప్పింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: