ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో హాస్య చిత్రాలకు దర్శకత్వం వహించిన జంద్యాల తర్వాత ఆ రేంజ్ లో తనదైన కామెడీ మార్క్ చాటుకున్నారు ఈవివి సత్యనారాయణ.  ఆయన దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘జంబలకిడి పంబ’అద్భుతమైన విజయం సాధించడమే కాదు ఒక ట్రెండ్ కూడా సృష్టించింది.   జంబ‌ల‌డికి పంబ టైటిల్ నే  కాకుండా కాన్సెప్ట్ కూడా తీసుకుని రూపొందించిన మూవీ జంబ‌ల‌కిడిపంబ‌… క‌మేడీయ‌న్ శ్రీ‌నివాసుల రెడ్డి హీరో.. సిద్ది ఇద్నాని హీరోయిన్.. ఆడ‌, మ‌గ మారిపోయే నేప‌థ్యంతో విడుద‌ల చేసిన ట్రైల‌ర్ అంద‌ర్ని ఆక‌ట్టుకుంది.. ఎలా ఉంటుంద‌నే క్యూరియాసిటిని కూడా పెంచింది.. మ‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. 


ఈ చిత్రంలో హీరో శ్రీనివాస‌రెడ్డి, హీరోయిన్ సిద్ది ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటారు..తర్వాత వీరి మద్య అభిప్రాయ భేదాలు రావడంతో విడాకులు తీసుకోవాలనుకుంటారు.  విడాకుల స్పెషలిస్ట్ పోసాని అప్పటికే 99 కేసులు డీల్ చేస్తాడు.  100వ విడాకులు కేసు శ్రీనివాస‌రెడ్డి, సిద్ది లది కావడంతో తాను గిన్నీస్ బుక్ రికార్డు కొట్టేస్తానని సంబరపడిపోతుంటాడు.  ఇంతలో ఓ కారు ప్రమాదంలో పోసాని ఆయన భార్య ఇద్దరూ చనిపోతారు.  

Image result for jamba lakidi pamba 2018

ఇక న‌ర‌కానికి చేరుకున్న భార్య భ‌ర్త‌ల‌లో భార్య‌కు మాత్ర‌మే న‌ర‌క ద్వారా ప్ర‌వేశం జ‌రుగుతుంది.. భ‌ర్త‌ను గేటులోనే ఆపేస్తారు.. ఇదేం అన్యాయం అంటూ ప్ర‌శ్నించిన లాయ‌ర్ కు దిమ్మ‌తిరిగే స‌మాధానం ఇస్తారు య‌మ‌పురీశ్వ‌రులు.. వందో విడాకుల కేసును ఉప‌సంహ‌రించుకుని హీరో, హీరోయిన్ ని కలిపితేనే ప్రవేశ ద్వారం అని చెప్పడం..భూమి పైకి వచ్చిన పోసాని ఆత్మగా ఏంచేశాడు..ఇద్దరిని కలిపాడా లేదా అన్న కోణంలో అమ్మాయి బాధ‌లు అబ్బాయిల‌కు, అబ్బాయిల బాధ‌లు అమ్మాయిలకు చెప్పాల‌నే ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడు మ‌ను. 


అయితే క‌థ‌ను స‌రిగా డీల్ చేయ‌లేకపోవ‌డంతో సాధార‌ణ మూవీలా మారింది..క‌మెడీ స‌న్నివేశాల‌లో సైతం క్లారిటీ లేకుండా సాగింది..క‌మేడ‌య‌న్ హీరో శ్రీ‌నివాస‌రెడ్ది త‌న పాత్ర‌లో అంద‌ర్ని మెప్పించాడు.. కొత్త హీరోయిన్ సిద్ధి ప‌ర‌వాలేద‌ని పించింది. పోసాని, వెన్నెల కిశోర్‌ పాత్రలు సినిమా మొత్తానికి హైలెట్ గా నిలిచారు.  ఇక  ధన్‌రాజ్‌, సత్యం రాజేశ్‌, చిత్రం శీను, రఘుబాబు, తనికెళ్ల భరణి తదితర నటులు ఉన్నప్పటికీ హాస్యం పండలేదు. సాంకేతికంగా సినిమా ఫర్వాలేదు. సంగీతం, ఛాయాగ్రహణం ఆక‌ట్టుకునే విధంగానే ఉంది. కామెడీ ప్రియులను కాస్త అలరించిందని అంటున్నారు కొంత మంది.   మొత్తానికి సినిమా హిట్టా..ఫట్టా అనేది రేపటి వరకు తెలిసిపోతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: