రాజమౌళి జూనియర్ చరణ్ లతో నిర్మించబోతున్న మల్టీ స్టారర్ కథ విషయమై ఒక స్పష్టమైన క్లారిటీకి రావడంతో అక్టోబర్ నుండి మొదలుకాబోతున్న ఈమూవీ నటీనటుల ఎంపిక పై రాజమౌళి దృష్టి పెట్టినట్లు సమాచారం. ఈసినిమాకు సంబంధించి హీరోయిన్స్ గా రకరకాల పేర్లు రాజమౌళి మనసులో ఉన్నా ‘మహానటి’ చూసిన తరువాత జక్కన్న దృష్టిలో తన మూవీలో కీర్తీ సురేష్ కు ఒక ఛాన్స్ ఇవ్వాలి అని డిసైడ్ అయినట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి.
Keerthi Suresh Images
తెలుస్తున్న సమాచారం మేరకు రాజమౌళి డైరెక్షన్ టీమ్ లోని ఒక కీలక వ్యక్తి ఈమధ్య కీర్తి సురేష్ ను కలిసి రాజమౌళి ఇచ్చిన ఆఫర్ ను వివరించడమే కాకుండా ఈసినిమాకు సంబంధించి రాజమౌళి పెట్టిన కొన్ని కండిషన్స్ కూడ వివరించినట్లు టాక్. అక్టోబర్ నుండి ప్రారంభం కాబోతున్న ఈ మల్టీ స్టారర్ విషయంలో వరసగా 80 రోజుల కీర్తి సురేష్ బల్క్ డేట్స్ కావాలని అడిగినట్లు సమాచారం. 

అదేవిధంగా ఈమూవీలో కీర్తికి ఆఫర్ చేయబడ్డ పాత్ర రీత్యా చాల గ్లామరస్ గా కనిపించాలని చెపుతూ ‘బాహుబలి’ మూవీలో ‘అవంతిక’ పాత్ర పోషించిన తమన్నా లా చాల గ్లామర్ గా కనిపించవలసిన అవసరంతో పాటు పాత్ర స్వభావ రీత్యా కొంత మేరకు ఎక్స్ పోజ్ చేయవలసిన అవసరం ఉంటుంది అని రాజమౌళి పెట్టిన కండిషన్స్ వివరించినట్లు తెలుస్తోంది. సాధారణంగా కీర్తి సురేష్ తన సినిమాలలో ఎక్స్ పోజింగ్ కు అంగీకరించని నేపధ్యంలో ముందుగానే రాజమౌళి ఈ కండిషన్స్ పెట్టినట్లు సమాచారం.
I'll never make mistakes Savitri ma'am did: Keerthy Suresh
దీనితో కీర్తి తన నియమాలను పక్కకు పెట్టి రాజమౌళి ఆఫర్ ను అంగీకరించాలా లేదంటే ఇదే పద్ధతి అనుసరించమని తన పై మిగతా సినిమాల దర్శక నిర్మాతల ఒత్తిడి పెరుగుతుంది కాబట్టి ఈఆఫర్ ను వేరే కారణాలతో సున్నితంగా తిరస్కరించాల అన్న అంతర్మధనంలో ఉన్నట్లు టాక్. ‘మహానటి’ మూవీ తరువాత కీర్తికి చాలామంది దర్శక నిర్మాతలు హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు ఆఫర్ చేస్తున్న నేపధ్యంలో రాజమౌళి ఆఫర్ ఆమెకు ఒక పరీక్ష అనడంలో ఎటువంటి సందేహం లేదు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: