Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Thu, Dec 13, 2018 | Last Updated 5:08 am IST

Menu &Sections

Search

టాలీవుడ్ - తెలుగు వాళ్ళంటేనే అనుమానంగా చూస్తున్న అమెరికన్ కౌన్సిలేట్!

టాలీవుడ్ - తెలుగు వాళ్ళంటేనే అనుమానంగా చూస్తున్న అమెరికన్ కౌన్సిలేట్!
టాలీవుడ్ - తెలుగు వాళ్ళంటేనే అనుమానంగా చూస్తున్న అమెరికన్ కౌన్సిలేట్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మన చంద్రులిద్దరు ప్రతిదానికి మనం ప్రపంచంలోనే పష్ట్ అంటుంటారు. ఆ కీర్తి సంగతిలో నిజమెంతుందో దేవుడికి తెలుసు. కాని టాలీవుడ్ మన జాతికిచ్చిన అపకీర్తి ఇప్పుడు నింగిని తాకింది, ముఖ్యంగా అమెరికాలో. అనేక సెక్స్ నేరాలకు అమెరికన్స్ కు గుర్తుకు వచ్చే పరిస్థితుల్లోకి మన తానా-ఆట - నాటాలు చేరిపోయాయి. మన సంస్కృతిని సాంప్రదాయాన్ని జాతి గౌరవాన్ని పాతరేసేశారు వీళ్ళంతా.  
tollywood-news-usa-telugu-people
చికాగో సెక్స్ రాకెట్ వ్యవహారంలో కిషన్ మోదుగమూడి చంద్రకళ మోదుగమూడి దంపతులను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వారిపై అమెరికా "హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ" అధికారులు చేపట్టిన  విచారణలో భాగంగా వారు, పలు తెలుగు సంఘాల పేర్లను లెటర్-హెడ్ లను వాడుకున్నట్లు వెల్లడించారు. దీంతో 'తానా అధ్యక్షుడు సతీష్ వేమన' ను కూడా అధికారులు విచారణ చేశారు. 

ఈ నేపథ్యంలో ఇకపై అమెరికాలో జరగబోయే ఈవెంట్లకు హాజరు కాబోయే హీరోయిన్లకు - నటీనటులకు ఇక్కట్లు తప్పేలా లేవు. తాజాగా అమెరికాలోని ఒక  ఈవెంట్ కు హాజరయ్యేందుకు సినీ టీవీ నటి సురేఖా వాణి చేసుకున్న వీసా దరఖాస్తును యూఎస్ కాన్సులేట్ తిరస్కరించినట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం యూఎస్ కాన్సులేట్ కు వెళ్లిన సురేఖ కు ఈ చేదు అనుభవం ఎదురైనట్లు సమాచారం. దాంతోపాటు వచ్చేనెలలో జరగబోతోన్న ఈవెంట్ కోసం కూడా తెలుగు అసోసియేషన్ వారికి వీసాలను యూఎస్ కాన్సులేట్ నిరాకరించినట్లు తెలుస్తోంది. 
tollywood-news-usa-telugu-people
టాలీవుడ్ లోని నటీనటులపై చికాగో సెక్స్-రాకెట్ ప్రభావం పడింది. ఎప్పటిలాగే రకరకాల ఈవెంట్లలో పాల్గొనేందుకు నటీనటులను-హీరోయిన్లను తెలుగు అసోసియేషన్లు ఆహ్వానిస్తున్నాయి. అయితే వారి వీసాలను యూఎస్ కాన్సులేట్ తిరస్కరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 22న అమెరికా వెళ్లేందుకు బీ1 బీ2 (ట్రావెల్ వీసా) వీసా కోసం సురేఖవాణి యూఎస్ కాన్సులేట్ కు ఇంటర్వ్యూ కోసం వెళ్లారట. తాను ఆటా సదస్సు కోసం అమెరికా వెళ్తున్నానని చెప్పగానే ఆమె వీసాను తిరస్కరించారట. 
tollywood-news-usa-telugu-people

సురేఖతోపాటు ఆ సభలకు హాజరుకావాల్సిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మేక మహేందర రెడ్డి వీసా దరఖాస్తు కూడా తిరస్కరణకు గురైంది. వీటితోపాటు తానా - ఆటా - నాటా వంటి తెలుగు అసోసియేషన్లు నిర్వహించే సదస్సుల పేరు చెబితే వీసా పై'రిజక్టెడ్' స్టాంప్ వేసేస్తున్నారని తెలుస్తోంది. గతంలో ఆ సభల ఇన్విటేషన్ కార్డుతో పాటు - ఆర్థిక స్థితిగతులు బాగుంటే వీసా ఇచ్చవారని, చికాగో సెక్స్ రాకెట్ తర్వాత అందరినీ అనుమానించి వీసాలు మంజూరు చేయడం లేదని తెలుస్తోంది. 


తమ సదస్సులకు మరింత ఆకర్షణ తెచ్చేందుకు హీరోయిన్లను నటీనటులను ఆహ్వానిస్తున్నామని వేరే కారణం లేదని చెప్పినా అధికారులు వినడం లేదట. దీంతో కిషన్ దంపతులపై తెలుగు అసోసియేషన్లు మండిపడుతున్నాయి. భవిష్యత్తులో జరిగే ఈవెంట్లకు నటీనటులు సెలబ్రిటీలను ఎలా అమెరికా తీసుకువెళ్లాలని మల్లగుల్లాలు పడుతున్నాయి. 

tollywood-news-usa-telugu-people

tollywood-news-usa-telugu-people's-prestige-is-los
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జూనియర్ ఎన్టీఆర్ అంటే నాకెంతో పిచ్చి! మాడ్ అయిపోతా! - గ్రేట్ గ్లామరస్ యాక్ట్రెస్
"టీఆరెస్ ఉనికే ఉండదు!" కేసీఆర్ తో సోనియా.....చాలెంజ్!
కేసీఆర్ కు ఆయన కుటుంబమే బలం బలహీనత కూడా!
గెలుపు రాష్ట్రాన్ని దోచుకోవటానికి లైసన్స్ కాదు! కేసీఆర్ కు ఫైర్ బ్రాండ్ రేవంత్ హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్ పై తెలంగాణా ప్రభావం?  ఆంధ్రలో ముందస్తు ఎన్నికలు వస్తాయా?
స్నేహం చేసి శీలం కోల్పోయిన కాంగ్రెస్ - టిడిపి పతనం సంపూర్ణం
తెలంగాణ ఎన్నికల బరిలో చంద్రబాబు ఓటమి పాలైతే - ఆంధ్రప్రదేశ్ లో టిడిపికి ఉరే!
సైబరాబాద్ నిర్మాణ ఘనత పివి నరసింహారావుది మాత్రమే!  చంద్రబాబుది మాత్రం కాదు!
మీడియా సంస్థకు లీగల్ నోటీసులు ఇస్తామని తెలంగాణా ఎన్నికల అధికారి బెదిరింపు?
ఏడిటోరియల్: ఇందరిలో కీలకంగా చక్రం తిప్పేదెవరు?  అయినా చక్రం తిప్పేదేముంది?
తెలంగాణాలో గల్లంతైన ఓట్లు 27 లక్షలు?
కార్ కు సై - కైట్ కి నై - రేపెల్లుండి తెలంగాణాలో అనూహ్యమైన మార్పులు
విజయ మాల్యా కు ఎదురు దెబ్బ - భారత్ కు అప్పగించాలని బ్రిటీష్ న్యాయస్థానం ఆదేశాలు
ఆర్బీఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్ రాజీనామా బ్రేకింగ్ ! సుబ్రహ్మణ్యం స్వామి స్పందన షాకింగ్
తెలంగాణాలో కర్ణాటక తరహా కాంగ్రెస్ వ్యూహం? డికె శివకుమార్ రంగ ప్రవేశం? ఇక రేపు హార్స్ ట్రేడింగేనా?
సుప్రీంకోర్టులో తెలంగాణాకు ఎన్నికల రిజర్వేషణ్ల విషయంలో ఎదురుదెబ్బ
అప్పుడు ప్రజాకూటమికి కాంగ్రెస్ గుడ్-బై! విభేధాలు మొదలయ్యేనా?
ఇండియా టుడే రాజ్దీప్ సర్దేశాయ్ మాట నిజమైతే  ఉత్తమ్‌ - గడ్డం తీసే సమయం దగ్గరపడినట్లే?
ఓటర్ జాబితాలో పేర్లు లేకుండా చేసి ఓటింగ్ శాతం తగ్గిందని ఓటర్లను నిందిస్తే ఎలా?
తెలంగాణా అంతటా గులాబి గుభాళింపు లేనా? మరి ఆంధ్రా ఆక్టోపస్ సర్వే? తమాషా కాదు!
జాతీయ రాజకీయం సెమీ-ఫైనల్స్ - నాలుగు రాష్ట్రాల శానససభ ఎగ్జిట్-పోల్ ఫలితాలు
About the author