నిన్న క్రేజీ యంగ్ హీరో విజయ్ దేవర కొండకు ఊహించని షాక్ ఇచ్చి అర్జున్ రెడ్డి కుటుంబ సభ్యులను ఆశ్చర్యపరిచారు మంత్రి కెటిఆర్. ప్రతి ఆదివారం తన రాజకీయాలను పక్కకు పెట్టి తనకు నచ్చిన సినిమాలను లేదంటే తనకు బాగా నచ్చినవారిని కలిసే అలవాటు ఉన్న కెటిఆర్ నిన్న తన వీకెండ్ ను విజయ్ దేవర కొండ ఇంటికి వెళ్ళి అతడి కుటుంబ సభ్యులతో కలిసి లంచ్ చేయడమే కాకుండా కొద్ది సేపు విజయ్ సినిమాల గురించి అనేక విషయాలు మాట్లాడినట్లు తెలుస్తోంది.
vijay devarakonda taxi wala teaser Latest 2018 - Sakshi
కొద్దిరోజుల క్రితం విజయ్ తెలంగాణ హీరోగా తనకు మొట్టమొదటిసారి వచ్చిన ఫిలిం ఫేర్ అవార్డును వేలం వేసి ఆ మొత్తాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం ఇస్తాను అని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన వచ్చిన కొద్ది రోజులకే మంత్రి కెటిఆర్ ఇప్పుడు స్వయంగా విజయ్ ఇంటికి వెళ్లి అతడిని అభినంధించడమే కాకుండా వారింట్లో లంచ్ చేయడం విజయ్ కెటిఆర్ ల మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని సూచిస్తోంది.
Vijay-Devarakonda
తెలంగాణ ప్రాంతానికి చెందిన కవులను కళాకారులను సినిమా నటులను గుర్తించి ప్రోత్సహించడంలో తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపద్యంలో ఈ ఇద్దరి కలయిక వెనుక ఏమైనా రాజకీయ కోణాలు ఉన్నాయా అంటూ అదేవిధంగా రాబోతున్న ఎన్నికలలో విజయ్ దేవర కొండ ఇమేజ్ ని వాడుకుంటూ టిఆర్ఎస్ పార్టీ విజయ్ ను ఎన్నికల ప్రచారంలోకి దించే వ్యూహంలో భాగమే నిన్నటి వీరిద్దరి కలయిక అని భావించాలా ? అంటూ కొందరి విశ్లేషకుల భావన.
Vijay Devarakonda is now ready with Taxi Wala
అయితే సినిమాలు అంటే విపరీతమైన అభిరుచి ఉన్న కెటిఆర్ కేవలం ఆ అభిమానంతోనే విజయ్ ఇంటికి వెళ్లి ఉంటారని ఇందులో రాజకీయ ఉద్దేశ్యాలు లేవు అంటూ మరి కొందరు కామెంట్స్ చేసుకుంటున్నారు. ఈ విషయాలను పక్కకు పెడితే విజయ్ కోరుకుంటున్నట్లుగా అతడి ఫిలిం ఫేర్ అవార్డును వేలం వేసి ఆమోత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధి కార్యక్రమాలకి ఖర్చు పెట్టే విషయంలో వీరిద్దరి మధ్య కొన్ని కీలక చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: