తెలుగు ఇండస్ట్రీలో కొన్ని చిత్రాలు కొంత మందికి ఒక్కసారే బ్రెక్ ఇవ్వడమే కాదు స్టార్ డమ్ అమాంతం పెంచేస్తుంది.  సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో సుదీర్ బాబు.  ఎస్ఎంఎస్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన సుదీర్ బాబు మంచి బ్రేక్ కోసం చూస్తున్న సమయంలో మారుతి కథ అందించిన ఈ సినిమాకు జె ప్రభాకర్‌ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘ప్రేమకథాచిత్రమ్’ అద్భుత విజయం సాధించింది. 
Image result for ప్రేమ కథా చిత్రం
హర్రర్ కామెడీతో ఈ సినిమా కడుపుబ్బా నవ్విస్తూనే భయపెట్టింది.  తాజాగా  కామెడీ హర్రర్‌ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమా సూపర్‌ హిట్ కావటంతో సుమంత్ అశ్విన్‌ హీరోగా సీక్వెల్‌ ను ప్రారంభించారు. ప్రేమ కథా చిత్రం 2 పేరుతో తెరకెక్కుతున్న ఈ సీక్వెల్‌ త్వరలోనే పట్టాలెక్కనుందని తెలుస్తోంది.హరి కిషన్‌ దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారు.

ఒక హీరోయిన్‌గా జంబ లకిడి పంబ ఫేం సిద్ధి ఇద్నాని నటిస్తుండగా మరో హీరోయిన్‌ గా ఎక్కడికి పోతావు చిన్నావాడా ఫేం నందిత శ్వేత నటించనుంది.  అయితే ఈ చిత్రం కూడా హర్రర్ కామెడీ జోన్ లో ఉండబోతుందా లేదా అనేది సస్పెన్స్.  ప్రేమ కథా చిత్రానికి నిర్మాతగా వ్యహరించిన సుదర్శన్‌ రెడ్డి సీక్వెల్‌ను కూడా నిర్మిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: