సూపర్ స్టార్ రజినీకాంత్ కు జపాన్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉండటం కాకుండా అతడి హోర్డింగ్స్ రజినీకాంత్ సినిమాలు విడుదల అయ్యే సమయంలో జపాన్ లో కూడ పెడతారు అంటే రజినీ మ్యానియా ఇప్పటికీ ఏవిధంగా ఉందో అర్ధం అవుతుంది. అనూహ్యంగా అటువంటి ఇమేజ్ ఇప్పుడు తెలుగులో విలక్షణ నటుడుగా పేరు తెచ్చుకున్న సుబ్బరాజుకు ఇప్పుడు జపాన్ లో కూడ ఊహించని ఇమేజ్ రావడం ప్రస్తుతం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.
A picture of Subbaraju AKA Baahubali
‘బాహుబలి 2’ లో కుమార వర్మ పాత్రను పోషించిన సుబ్బరాజు తన నటనతో ఆసినిమా ఘనవిజయంలో తనవంతు పాత్రను నిర్వర్తించాడు. ప్రస్తుతం ‘బాహుబలి 2’ జపాన్ భాషలోకి డబ్ చేయబడి అక్కడ కూడ ఘన విజయం సాధించడంతో జపాన్ మీడియా ఈసినిమా పై వ్రాస్తున్న వార్తలలో ప్రభాస్ రానా అనుష్క ల కంటే సుబ్బరాజు తన పాత్రలో చాల సహజంగా నటించాడని ప్రశంసలు కురిపిస్తోంది.

అంతేకాదు ప్రభాస్ రానాలు కేవలం సూపర్ హీరోలుగా మాత్రమే కనిపిస్తారని అయితే సుబ్బరాజు కుమార్ వర్మ పాత్రలో మాత్రం నవ్వు తెప్పిస్తూ యుద్ధం అంటే భయపడిపోయే ఒక పిరికివాడు చివరికి తన శత్రువులను ధైర్యంగా హతమార్చే పాత్రలో సుబ్బరాజు బాగా నటించాడనీ జపాన్ మీడియా కామెంట్స్ వ్రాస్తోంది. దీనికితోడు జపాన్ దేశంలోని సినిమా ప్రేక్షకులకు సుబ్బరాజు నటన చాలా వెరైటీగా అనిపించిందట.

దీనితో సుబ్బరాజు జపాన్ లో త్వరలో ఏర్పాటు చేయబోతున్న ‘బాహుబలి 2’ సంబంధించిన కార్యక్రమానికి అతిధిగా వెళ్ళబోతున్నాడు. దీనికి సంబంధించి సుబ్బరాజు తన జపాన్ వీసా క్లియర్ చేయించుకోవడానికి సంబంధించిన పనులలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సుబ్బరాజుకు టోక్యోలో అభిమానులు కూడ ఏర్పడ్డారు అంటే సుబ్బరాజు మ్యానియా జపాన్ లో ఏ రేంజ్ కి చేరిందో అర్ధం అవుతుంది. ఏమైనా ప్రభాస్ రానా లను సుబ్బరాజు డామినేట్ చేసి జపాన్ లో బాహుబలి హీరో అయ్యాడనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: