ఇప్పటికే ఒక క్రికెట్ టీమ్ సంఖ్యను దాటిపోతున్న మెగా హీరోల లిస్టులో మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ కూడ చేరి పోవడంతో సంవత్సరంలోని 12 నెలలు వీరి సినిమాల విడుదలకు సరిపోతాయా అన్న కామెంట్స్ వస్తున్నాయి. ఇలాంటి పరిస్థుతులలో వచ్చేనెల విడుదల కాబోతున్న ‘విజేత’ ట్రైలర్ కు అదేవిధంగా ఈమూవీలోని పాటలకు మంచి స్పందన వస్తూ ఉండటంతో కళ్యాణ్ తన మొదటి సినిమాతోనే హిట్ కొడతాడా అన్న అంచనాలు పెరిగిపోతున్నాయి.
Chiru Son in-law Kalyan Dev movie details
ఇలాంటి పరిస్థుతులలో సోషల్ మీడియాలో నిరంతరం సందడి చేస్తూ తోటి హీరోల సినిమాల పై కామెంట్స్ చేసే సాయి ధరమ్ తేజ్ అల్లు శిరీష్ వరుణ్ తేజ్ లు కళ్యాణ్ దేవ్ ‘విజేత’ ట్రైలర్ పై ఎటువంటి కామెంట్స్ ఎందుకు చేయడం లేదు అన్న కామెంట్స్ ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తున్నాయి. ఇప్పటికే మెగా హీరోల సంఖ్య పెరిగి విపరీతమైన పోటీ తమ మధ్యనే ఏర్పడటంతో ఈ అనవసరపు పోటీ మధ్య కళ్యాణ్ దేవ్ ఎంట్రీ ఏమిటి అన్న అభిప్రాయంతో మెగా యంగ్ హీరోలు కళ్యాణ్ దేవ్ పై మౌనంగా ఉన్నారా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Whopping budget for Ram Charans single scene
అయితే ఇది అంతా ఒక వ్యూహంలో భాగమనీ ‘విజేత’ విడుదల అయ్యేదాకా చిరంజీవి తన శక్తిమేరకు ఈసినిమా పై అంచనాలు పెంచి విడుదల అయిన తరువాత కళ్యాణ్ దేవ్ ను ప్రశంసించే కార్యక్రమాన్ని మెగా యంగ్ హీరోలు చేసే విధంగా తయారు చేసిన స్ట్రాటజీలో ఈ మెగా యంగ్ హీరోల మౌనం ఒక భాగం అని అంటున్నారు. అయితే ఈవిషయం పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతూ ఉండటంతో మెగా యంగ్ హీరోల మౌనం వెనుక ఎదో ఒక కారణం ఉంది అన్న గాసిప్పులు ఇంకా హడావిడి చేస్తూనే ఉన్నాయి.
kalyan dev vijetha movie stills
ఇది ఇలా ఉండగా ‘విజేత’ విడుదల కాకుండానే మెగా కాంపౌండ్ కళ్యాణ్ దేవ్ కు సరిపోయే పెద్ద దర్శకుల వేటలో పడింది అని వార్తలు వస్తున్నాయి. ఈ వేటలో భాగంగానే హరీష్ శంకర్ వైపు మెగా కాంపౌండ్ దృష్టి మళ్ళిందనీ అన్నీ కుదిరితే ‘విజేత’ రిజల్ట్ తో సంబంధం లేకుండా కళ్యాణ్ దేవ్ హరీష్ శంకర్ ల కాంబినేషన్ లో ఒక మూవీని నిర్మించదానికి మెగా కాంపౌండ్ కు అతి సన్నిహితుడైన ఒక ప్రముఖ నిర్మాత అప్పుడే రంగంలోకి దిగినట్లు టాక్.. 


మరింత సమాచారం తెలుసుకోండి: