కృష్ణంరాజు వారసత్వాన్ని కొనసాగిస్తూ ‘బాహుబలి’ తో నేషనల్ స్టార్ గా మారిపోయిన ప్రభాస్ పెళ్లి టాపిక్ ఎప్పుడూ మీడియాకు హాట్ టాపిక్.  దీనితో ప్రభాస్ పెళ్ళి గురించి జాతీయ మీడియా దగ్గర నుంచి తెలుగు మీడియా వరకు ఎవరో ఒకరు ఏదో ఒక న్యూస్ ప్రచారంలోకి తీసుకు రావడం అలవాటుగా మారిపోయింది. ఇలాంటి పరిస్థితులలో ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ పెళ్లి పై కృష్ణంరాజు ఊహించని సమాధానం ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు. 
ఎప్పుడు అడిగినా అదే సమాధానం
ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అని ఆమీడియా సంస్థ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ప్రభాస్ చిన్నపిల్లవాడు కాదని ఏనిర్ణయం ఎప్పుడు తీసుకోవాలో బాగ తెలుసనీ ఇక ఈవిషయం గురించి తనను అడగటం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని అంటూ ఆమీడియా సంస్థ ప్రతినిధి పై అసహనం వ్యక్త పరిచాడు కృష్ణంరాజు. ఇదే సందర్భంలో తన స్వీయ దర్శకత్వంలో ప్రభాస్ తో తీయాలనుకున్న ‘ఒక్క అడుగు’ అదేవిధంగా తనకు ఎంతో ఇష్టమైన ‘భక్త కన్నప్ప’ రీమేక్ ఇప్పట్లో ఉండకపోవచ్చు అన్న సంకేతాలు ఇచ్చాడు రెబెల్ స్టార్.  
సాహోతో బిజీగా
ప్రస్తుతం ‘సాహో’ షూటింగ్ లో ఉన్న  ప్రభాస్ తన సొంత నిర్మాణ సంస్థలో రాధాకృష్ణ దర్శకత్వంలో నటించబోయే సినిమా విశేషాలు మాత్రమే తాను చెప్పగలను అని ప్రభాస్ పెళ్లి విషయాలు మాత్రం తన దగ్గర లేవు అంటూ కృష్ణంరాజు చేసిన జోక్ ను బట్టి ఇప్పట్లో ప్రభాస్ పెళ్ళి లేనట్లే అని అనుకోవాలి. అయితే ఈమధ్య ఒక మీడియా సంస్థ ప్రభాస్ పెళ్ళి గురించి వార్తలు వ్రాస్తూ గోదావరి జిల్లాల ప్రాంతానికి చెందిన ఒక ప్రముఖ విద్య సంస్థ అధినేత కూతురుతో ప్రభాస్ పెళ్లి కుదిరింది అని వార్తలు వచ్చిన తరువాత ఇప్పుడు ఇలా కృష్ణంరాజు ప్రభాస్ పెళ్లి విషయమై నిర్లిప్తత ప్రకటించడం వెనుక ఎదో కారణం ఉండి ఉంటుంది అని చాలామంది ఊహ. 
సమాధానం చెప్పుకుంటోన్న కృష్ణం రాజు
అయితే తన పెళ్లి పై ఎవరు ఎన్ని రూమర్స్ ప్రచారంలోకి తీసుకువచ్చినా నవ్వుతూ కాలం గుడుపుతున్న ప్రభాస్ మనసులో ఎదో ఒక స్థిర నిర్ణయం ఉంది అన్నది మాత్రం నిజం. ఇక లేటెస్ట్ గా కృష్ణంరాజు ప్రభాస్ పెళ్లి గురించి ఈ ఊహించని ట్విస్ట్ ఇచ్చిన నేపధ్యంలో ఇప్పట్లో ప్రభాస్ పెళ్లి పీటలు ఎక్కడం కల మాత్రమే అని అనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: