ఈ మద్య టాలీవుడ్ లో బయోపిక్ సినిమాలో బాగా వస్తున్నాయి.  అలనాటి మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘మహానటి’మంచి హిట్ అయ్యింది. దాంతో ఇప్పుడు బయోపిక్ సినిమాలు తీస్తే మంచి క్రేజ్ తో పాటు కమర్షియల్ గా కూడా మంచి లాభాలు వస్తాయన్న ఆలోచనలో దర్శక, నిర్మాతలు ఉన్నారు.  ప్రస్తుతం టాలీవుడ్ లో ఎన్టీఆర్, వైఎస్సార్ బయోపిక్ లు రాబోతున్నాయి.  

Image result for kcr

అంతే కాదు భారత దేశంలో అత్యంత బలమైన వ్యక్తిగా కీర్తి ప్రతిష్టలు సంపాదించిన కోడీ రాంమూర్తి జీవిత కథ ఆధారంగా రానా హీరోగా మరో సినిమా తెరకెక్కిస్తున్నారు.  తాజాగా మరో రాజకీయ నాయకుడి జీవిత కథ వెండితెరకెక్కేందుకు సిద్ధమవుతోంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ఉద్యమ సారథి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బయోపిక్‌ ఈ రోజే (గురువారం) ప్రారంభమైంది. మొదట్లో కేసీఆర్ పాత్రలో ప్రకాష్ రాజ్ నటిస్తారని ప్రచారం జరిగినా, చివరకి విలక్షణ నటుడు నాజర్ ని ఫైనల్ చేశారట. 


ఈ సినిమాలో టైటిల్ ‘ఉద్యమ సింహం’ అని పెట్టాలని ఆలోచిస్తున్నారట.  ఈ చిత్రాన్ని కృష్ణం రాజు తెరకెక్కించనున్నారు. కల్వకుంట్ల నాగేశ్వర్ రావు నిర్మాణంలో ఈ బయోపిక్ రూపొందనుంది. ఇవాళే అన్నపూర్ణ స్టూడియోస్ లో అధికారికంగా లాంచ్ చేసుకున్న ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనుంది. తెలంగాణ కోసం అరవై సంవత్సరాలు పోరాటం ఏ రేంజ్ లో చూపిస్తారో..కేసీఆర్ ని ఎలా చూపించనున్నారో అన్న క్యూరియాసిట్ అభిమానుల్లో అప్పుడే మొదలైంది.  ఇతర నటీ నటుల వివరాలు త్వరలో ప్రకటిస్తామని చిత్ర యూనిట్ తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: