భారీ అంచనాలతో ప్రారంభం అయిన ‘బిగ్ బాస్’ రెండో సీజన్ అంతంతమాత్రంగా నడుస్తున్న నేపధ్యంలో ఈకార్యక్రమానికి ఏమాత్రం చెప్పుకోతగ్గ రేటింగ్స్ రాకపోవడం స్టార్ మా యాజమాన్యాన్ని కలవర పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అత్యంత భారీ స్థాయిలో సెట్ వేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నా ఈ షో పట్ల బుల్లితెర ప్రేక్షకులు నిరాశ చెందడం స్టార్ మా యాజమాన్యాన్ని ఆలోచింప చేసి నష్ట నివారణ చర్యల గురించి ప్రయత్నించేలా చేస్తోందని టాక్. 
100 బాటిళ్ల చెరుకు రసం
ఎన్టీఆర్ స్థానంలోకి వచ్చిన నాని ఒక మోస్తరుగానే షోను నడిపిస్తున్నా నానీకి పూర్తి స్థాయిలో మార్కులు పడటం లేదు. దీనికితోడు ప్రతిరోజు ప్రసారం అవుతున్న ఈకార్యక్రమాలలో ఎటువంటి మార్పులు లేకుండా పార్టిసిపెంట్ల కుట్రలు కుతంత్రాలు గ్రూపులతో షో నడుస్తున్న నేపధ్యంలో ఈషో రోతగా తయారైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 
10 వేలకు గ్రీన్ జట్టులోకి తేజస్విని
ఈ నేపథ్యంలో ఈ షోపై రోజురోజుకూ నెగెటివ్ కామెంట్స్ పెరిగిపోతున్నాయి.  ఇలాంటి పరిస్థుతులలో ఈ షోకి ఊహించని లిఫ్ట్ ఇవ్వడానికి ఒకరోజు జూనియర్ ను ఈ కార్యక్రమానికి అతిధిగా పిలిచి హౌస్ లోకి ఎంటర్ చేయడానికి ఒక మాస్టర్ ప్లాన్ స్టార్ మా యాజమాన్యం రచించినట్లు వార్తలు వస్తున్నాయి. 
క్లోజ్‌గా ఉంటే తట్టుకోలేను
అయితే ఈఆలోచనకు జూనియర్ ను ఒప్పించడం చాల కష్ట సాధ్యం అయినా గట్టి ప్రయత్నాలు చేస్తూ కేవలం ఒక్కరోజు ‘బిగ్ బాస్ 2’ షోలో మెరుపులా మెరిసి నందుకు జూనియర్ కు భారీ పారితోషికం స్టార్ మా యాజమాన్యం ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి జూనియర్ ప్రస్తుతం ‘అరవింద సమేత’ షూటింగ్ లో బిజీగా ఉండటంతో పాటు నానీ నిర్వహిస్తున్న ఈ షోలో మధ్యలో ఇలా వేలు పెట్టడానికి జూనియర్ అంగీకరించడానికి పెద్దగా ఆసక్తి కనపరచడం లేదు అన్న వార్తలు వస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: