ప్రస్థుతం బయోపిక్ ల హవా నడుస్తున్న నేపధ్యంలో ప్రస్తుతం సెట్స్ పై ఉన్న వైఎస్ఆర్ బయోపిక్ పై కూడ విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈసినిమాను అత్యంత భారీ స్థాయిలో తీయడమే కాకుండా ఈమూవీలో వైఎస్ఆర్ పాత్రను మమ్ముట్టి పోషిస్తున్న నేపధ్యంలో ఈసినిమాను అత్యంత సహజంగా వాస్తవాలకు దగ్గరగా తీస్తున్నారు. అయితే ఆశ్చర్యకరంగా ఈ బయోపిక్ వెనుక ప్రభాస్ హస్తం ఉంది అని వార్తలు రావడం ఇండస్ట్రీ వర్గాలలో సంచలనంగా మారింది.
Mammootty’s first look as YSR was shared on Saturday.
ఈసినిమాను ‘ఆనందో బ్రహ్మ’ ఫేం దర్శకుడు మహీ రాఘవ్ దర్శకత్వం వహిస్తుంటే ఈసినిమాకు విజయ్ నిర్మాణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. తెలుస్తున్న సమాచారం మేరకు విజయ్ ప్రభాస్ లు చాల సన్నిహితులు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈమూవీ స్క్రిప్ట్ తనకు బాగా నచ్చడంతో ఈమూవీ బడ్జెట్ గురించి ఏమాత్రం ఆలోచించవద్దని తాను ఈ ప్రాజెక్ట్ ను అన్ని విధాల ప్రోత్సహిస్తాను అంటూ ప్రభాస్ ఈసినిమా నిర్మాత విజయ్ కు మాట ఇచ్చినట్లు సమాచారం. 
know who is playing ys jagan in ysr biopic?
ప్రస్తుతం ఈమూవీ దర్శక నిర్మాతలకు ప్రభాస్ ఇచ్చిన ప్రోత్సాహంతో ఈమూవీలోని కీలక పాత్రలకు చాలామంది ప్రముఖ నటులను ఎంపిక చేస్తు న్నట్లు వార్తలు వస్తున్నాయి. రాబోతున్న సంక్రాంతికి విడుదల చేయాలి అన్న టార్గెట్ తో శరవేగంగా నిర్మాణం జరుపుకుంటున్న ఈమూవీకి సంబంధించి ఒక ప్రత్యేకమైన సెట్ ను యూసఫ్ గుడాలో వేయడమే కాకుండా ఆసెట్ పూర్తిగా వైఎస్ఆర్ ఇంటిని పోలి ఉండేడట్లుగా క్రియేట్ చేయడం సంచలనంగా మారింది.
prabhas-saaho-new-look-birthday-photo-shoot-stills-1
అయితే రాజకీయాలకు దూరంగా ఉండే ప్రభాస్ ఒక రాజకీయ నాయకుడు జీవితం పై తీస్తున్న సినిమాకు పరోక్షంగా సహకరిస్తూ ఉండటం వెనుక ఆంతర్యం ఏమిటి అన్న కోణంలో ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో వార్తల హడావిడి జరుగుతోంది. ఈ పరిణామం చూస్తుంటే ప్రభాస్ ఈ బయోపిక్ కు మరింత క్రేజ్ కలిగించే విధంగా ఈమూవీకి వాయస్ ఓవర్ ఇచ్చినా ఆశ్చర్యం లేదేమో అని అనిపించడం సహజం..  



మరింత సమాచారం తెలుసుకోండి: