తెలుగు ఇండస్ట్రీలో ‘పెళ్లిచూపులు’చిత్రంతో అందరి మనసు దోచిన దర్శకులు తరుణ్ భాస్కర్.   షార్ట్ ఫిలిమ్ మేకర్ గా ఉన్న తరుణ్ తన స్నేహితులతో కలిసి చిన్న బడ్జెట్ తో ‘పెళ్లిచూపులు’ చిత్రాన్ని తీశారు.  ఈ చిత్రంతో విజయ్ దేవరకొండ కు స్టార్ ఇమేజ్ వచ్చింది.  తాజాగా తరుణ్ భాస్కర్  డైరెక్ట్ చేసిన తాజా సినిమా ‘ఈ నగరానికి ఏమైంది ?’.ఈ చిత్రం ప్రీమియం టాక్ షో వచ్చేసింది.  మీ గ్యాంగ్ తో థియేటర్ కి రండి చూస్కుందాం అని ఛాలెంజ్ చేసిన తరుణ్ భాస్కర్.  అంతా కొత్త నటులతో ప్రయోగాత్మాకంగా తెరకెక్కించారు విజయ్ భాస్కర్. 
Related image
చిత్రం అంతా నలుగురు స్నేహితుల మద్య సాగుతుంది.   వీరిలో వివేక్ డైరెక్టర్ అవ్వాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ అతని లవ్ బ్రేకప్ అవ్వడంతో అతను డిప్రషన్ లోకి వెళ్లి నలుగురి మధ్య కొంత దూరం పెరుగుతుంది.   నలుగురిలో ఒకరైన స్నేహితుడుపెళ్లి కుదరడంతో అందరూ బార్లో కలిసి మందు తాగుతారు. ఆ మత్తులోనే గోవా వరకు వెళ్ళిపోతారు. అలా వెళ్లిన ఆ నలుగురి జర్నీ ఎలా సాగింది, అసలైన జీవితానికి వాళ్ళు తెలుసుకున్న అర్థం ఏమిటి అనేదే తెరపై నడిచే చిత్రం. 
Image result for e nagaraniki emaindi movie
ఇక కామెడీ టైమింగ్ కూడా బాగానే పండించారి టాక్ వస్తుంది.  ఓరాల్ గా సినిమా జీవితమంటే అసలైన అర్థం తెలుసుకోవడం అనే కాన్సెప్ట్, అందులో జీవితమంటే నచ్చిన వాళ్లతో ఉంటూ, నాలుగు మెతుకులు తింటూ, నచ్చిన పని చేసుకోవడమే అంటూ తరుణ్ భాస్కర్ చెప్పిన అర్థం మనసుని తాకాయి.  యువతను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ చిత్రం రెగ్యులర్ యాక్షన్ ఎంటర్టైనర్లను కోరుకునే వారిని, కుటుంబ ప్రేక్షకుల్ని పూర్తిగా సంతృప్తిపరచలేదు. 
Image result for e nagaraniki emaindi movie
సెకండాఫ్ లో మాత్రం తమ స్నేహితుడిని డిప్రెషన్ నుంచి మిగిలిన స్నేహితులు ఎలా బయట పడేశారా..సరదాగా సాగే వారి జర్ని నిజంగా మన స్నేహితుల మద్య సాగినట్లే అనిపిస్తుంది..ఈ విషయంలో దర్శకుడు బాగానే సక్సెస్ అయ్యారనిపిస్తుంది. తరుణ్ భాస్కర్ తాను ఎలాంటి చిత్రం అయితే తీయాలి అనుకున్నారో అలాంటి సినిమానే తీసి దర్శకుడిగా, కథకుడిగా సక్సెస్ అయ్యారు. 
Image result for e nagaraniki emaindi movie
అక్కడక్కడా కొన్ని బోర్ సీన్లు ఉన్న కొంత కామెడీతో కవర్ చేశారు.  సంగీత దర్శకుడు వివేక్ సాగర్ పాటలు సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ సహజంగా ఉంది. రవితేజ గిరిజాల ఎడిటింగ్ బాగానే చేశారు. డి. సురేష్ బాబుగారు నిర్మాతగా మరో మంచి చిత్రాన్ని అందించారని టాక్ వస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: