‘నాపేరు సూర్య’ ఘోరమైన ఫ్లాప్ గా మారడంతో అయోమయంలోకి వెళ్ళిన అల్లు అర్జున్ ఆలోచనలకు ఎట్టకేలకు ఒక పరిష్కారం లభించినట్లుగా వార్తలు వస్తున్నాయి. రకరకాల ఆలోచనలతో అనేకమంది దర్శకుల పేర్లతో మ్యూజికల్ చైర్ గేమ్ ను తలపిస్తూ అల్లు అర్జున్ పడిన టెన్షన్ కు ఒక పరిష్కార మార్గం లభించింది. 
Image may contain: 1 person, beard
శేఖర్ కమ్ములతో ఒక పొలిటికల్ సినిమాను చేయడం కంటే క్రియేటివ్ దర్శకుడు విక్రమ్ కుమార్ తో ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ మూవీ చేయడం మంచిది అన్న స్థిర నిర్ణయానికి ఎట్టకేలకు బన్నీ వచ్చినట్లు తెలుస్తోంది.  బన్నీ సూచనలతో ఈ సినిమాకు సంబంధించిన కథలో అనేక మార్పులు విక్రమ్ కుమార్ చేయడం పూర్తి అవ్వడంతో ఈమూవీ స్క్రిప్ట్ కు సంబంధించిన డైలాగ్ వర్షన్ కూడ పూర్తి అయినట్లు తెలుస్తోంది.
Allu Arjun's Takshana Karthavyam
ఈ సినిమాను నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో అల్లు అర్జున్ తో ‘దేశముదురు’ ‘వరుడు’ ‘జులాయి’ లాంటి సినిమాలను తీసిన దానయ్య మళ్ళీ బ్ననీతోనే జత కడుతున్నాడు. తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీ కథలో కొంత ఫ్యాంటసీ టచ్ ఉంటుంది అని సమాచారం. 
Allu Arjun
అయితే ఒక క్యూట్ లవ్ స్టోరీకి ఫ్యాంటసీ టచ్ ఇచ్చే కథ కావడంతో అల్లు అర్జున్ లవర్ బాయ్ గా కనిపించడానికి ఈ సినిమాకు సంబంధించి తన లుక్ లో చాల మార్పులు చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను వీలైనంత త్వరగా ప్రారంభించి అన్నీ కుదిరితే వచ్చే ఏడాది సమ్మర్ రేస్ లో ఈసినిమాను నిలబెట్టాలని అల్లు అర్జున్ తాపత్రయ పడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇదే సమ్మర్ రేస్ ను మహేష్ కూడ టార్గెట్ చేస్తున్న నేపధ్యంలో బన్నీ మహేష్ ల మధ్య సమ్మర్ వార్ జరిగే ఆస్కారం ఉంది..   


మరింత సమాచారం తెలుసుకోండి: