తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు కుర్ర హీరోయిన్ల హవా బాగా పెరిగిపోయింది.   నానీతో ‘కృష్ణగాడి వీరప్రేమగాధ’ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మెహ్రిన్ కౌర్ వరుస విజయాలతో తెలుగు, తమిళ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ గా మారిపోయింది.    యువ హీరోలతో సినిమా చాన్స్ లను కొట్టేసి, దక్షిణాది సినీ ప్రేక్షకుల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ మెహరీన్ కు రైల్లో ఓ భయానక అనుభవం ఎదురైంది. 
Image result for mehreen kaur
వివరాల్లోకి వెళితే..తాజాగా ఈ అమ్మడు  తమిళ చిత్రం 'నోటా'లో నటిస్తుంది.  సినిమా షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ నుంచి చెన్నైకి ఆమె ప్రయాణం చేయాల్సి వుండగా, విమానంలో టికెట్ దొరకక పోవడంతో రైల్లో ప్రయాణించేందుకు అంగీకరించిందట.  ఆ నిర్మాత ఓ బెర్త్ బుక్ చేయించాడట..మెహ్రిన్ రైలు ఎక్కే సమయానికి అక్కడ ఓ తాగుబోతు తన బెర్త్ ను ఆక్రమించాడట. అతన్ని చూసి భయంతో వణికిపోయిన మెహరీన్, అతన్ని కదపడం ఇష్టంలేక చాలాసేపు రైల్లో నిలబడే ఉందట.
Image result for mehreen kaur rail
చివరకు నిర్మాతకు ఫోన్ చేసి విషయం చెప్పడంతో, ఆయన స్పందించి, ఓ కారులో తన మనసుషులను పంపారట.  మొత్తానికి  రైలుకు ఎదురొచ్చి, ఓ స్టేషన్ నుంచి మెహరీన్ ను పికప్ చేసుకుని చెన్నైకి తీసుకెళ్లారట. ఈ విషయాన్ని వెల్లడించిన 'నోటా' బృందం, మెహరీన్ చాలా భయపడిపోయిందని, ఇటువంటి ఘటనలు పలువురికి ఎదురవుతున్నాయని తెలిపారు. ఆ మద్య అమెరికాలో కూడా మెహ్రిన్ ని విమానాశ్రయంలో సెక్స్ రాకెట్ విషయంలో ప్రశ్నించిన విషయం తెలిసిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: