ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీ నుంచి హీరోలు కొత్త హీరోలు వస్తున్న విషయం తెలిసిందే. మొదటి సారిగా మెగాబ్రదర్ నాగబాబు కూతురు కొణిదెల నిహారిక ‘ఒక మనసు’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.  అయితే నిహారిక నేరుగా హీరోయిన్ గా వెండితెరపైకి రాలేదు..మొదట బుల్లితెరపై యాంకర్ గా తన సత్తా చాటింది..షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది.  నాగశౌర్య సరసన ‘ఒకమనసు’ చిత్రంతో హీరోయిన్ గా మంచి మార్కులే కొట్టేసింది.  అయితే ఈ చిత్రం కమర్షియల్ గా హిట్ కాలేదు.  తర్వాత తమిళంలో కూడా నటించింది నిహారిక. 

తాజాగా సుమంత్ అశ్విన్, నిహారిక జంటగా నటించిన చిత్రం ‘హ్యాపీ వెడ్డింగ్’. లక్ష్మణ్ కార్య దర్శకుడు. యు.వి.క్రియేషన్స్, పాకెట్ సినిమా సంయుక్తంగా నిర్మించాయి. ఈ రోజు సుమంత్ అశ్విన్ పుట్టినరోజును పురష్కరించుకుని ‘హ్యాపీ వెడ్డింగ్’ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఒక అమ్మాయికి, అబ్బాయికి పెళ్లి కుదరడం దగ్గర నుంచి పెళ్లి జరిగేంత వరకు మధ్యలో ఏం జరిగింది, వారి మధ్య చోటుచేసుకున్న సంఘటనలతో ‘హ్యాపీ వెడ్డింగ్’ను తెరకెక్కించినట్లు ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతోంది.

‘మా మనవడికి పెళ్లి కుదిరిపోయిందబ్బాయి.. పిల్ల సూపరు’ అంటూ అన్నపూర్ణమ్మ వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ ప్రారంభమవుతోంది.  ట్రైలర్ లో నిహారిక చాలా అల్లరి తో పాటు సెంటిమెంట్ ఉన్న అమ్మాయిగా కనిపిస్తుంది. వుతోంది. బార్‌లో నిహారిక మందు కొట్టడం, డ్యాన్సులు, స్కూటర్‌ మీద ఊగుతూ వెళ్లడం సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.

‘నేను వైన్ తాగుదామనుకున్నాను.. కానీ, వోడ్కా తాగాను. అయినా నువ్వు ఏమనలేదు’ అంటూ సుమంత్‌కు ముద్దుపెట్టే సీన్‌లో నిహారిక భలే క్యూట్‌గా అనిపించింది. స్వచ్ఛమైన పాల లాంటిది మా అక్షర. కాఫీ చేసుకోవచ్చు, కాంప్లైన్ చేసుకోవచ్చు’ అంటూ మురళీశర్మ నిహారిక గురించి చెప్తున్నప్పుడు.. ‘మా మనవడితో కాపురం చేసుకోవచ్చా అండి?’ అనే అన్నపూర్ణమ్మ చమత్కారం నవ్వు తెప్పిస్తుంది.

‘విజయవాడ అబ్బాయిలు చాలా రొమాంటిక్.. ఏం చేసినా చాలా రొమాంటిక్‌గా చేస్తారు’ అంటూ అక్కడి కుర్రాళ్లకు దర్శకుడు వల వేసేశారు. చివరిగా నరేష్ ‘వాళ్లెవరునుకుంటున్నావురా.. అమ్మాయిలురా’ అని దన్నం పెట్టే సీన్‌తో ట్రైలర్ ముగిసింది. కాగా, ఈ చిత్రానికి ‘ఫిదా’ ఫేమ్ శక్తికాంత్ స్వరాలు సమకూర్చారు. ఎస్.ఎస్.తమన్ నేపథ్య సంగీతం అందించారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: