ఈ మద్య కొంత మంది అభిమానులు తమ అభిమాన హీరో, హీరోయిన్లు కోసం చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు.  తమ అభిమాన హీరో సినిమాలు రిలీ అవుతున్నాయంటే థియేటర్ల వద్ద ఎంతో సందడి చేస్తుంటారు..తమ కుటుంబ సభ్యులకు కూడా ఇవ్వని ప్రాధాన్యత తమ అభిమాన హీరోలకు ఇచ్చే అభిమానులు ఉన్నారు.  ఒక్కో సమయంలో అభిమానుల హద్దులు దాటుతూ వారు చేసే హల్ చల్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంటాయి.  గతంలో పవన్ కళ్యాన్ ఇంటి ముందు ఓ యువతి తనను పెళ్లి చేసుకోవాలని తెగ సందడి చేసింది.  

 ఎందుకలా చేసింది?

ఇక పవన్ మీటింగ్స్ లో కొంత మంది ఆయన్ని కలిసే విధానం చూస్తుంటే షాక్ తిన్న సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా అక్కినేని నాగార్జున కు ఇలాంటి అనుభవమే ఏదురైంది.  నాగార్జున ఇంటి వద్ద మంగళవారం రాత్రి ఓ యువతి నానా యాగీ చేసింది. నాగార్జున తనకు నాలుగు కోట్ల రూ‌పాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నానా రభస చేసింది. దీంతో అక్కడి భద్రతా సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారొచ్చి ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
నాగార్జున బిజీ బిజీ
 అసలు విషయానికి వస్తే..ఆదిలాబాద్‌కు చెందిన విజయ అనే మహిళ మంగళవారం రాత్రి జూబ్లీహిల్స్‌కు చేరుకుంది. రోడ్డు నంబరు 51లో ఉన్న నాగార్జున ఇంటికి వెళ్లింది.  హీరో నాగార్జునను కలవాలని..తనతో మాట్లాడాలని నాగ్ పీఏని కోరింది.  కానీ ఆయన లేరని..షూటింగ్ పనిపై బయటకు వెళ్లారని అక్కడ సిబ్బంది తెలిపారు. అయినా నాగార్జునను ఎందు కలవాలని కోరుకుంటున్నారి ఆయన పీఏ మహిళలను అడిగారు.  

Nani Nagarjuna Movie titled Devadasu

ఆమె చెప్పిన సమాధానం విని షాక్ తిన్నాడు.  నాగార్జున తనకు రూ.4 కోట్లు ఇవ్వాలని చెప్పడంతో ఆశ్చర్యపోయాడు. నాగార్జున లేరని, తర్వాత రావాలని చెప్పినా ఆమె వినిపించుకోకుండా రోడ్డుపై హడావిడి చేసింది. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. యువతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమె మానసిక స్థితి బాగాలేదని తేల్చారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: