నానీకి టాప్ యంగ్ హీరోల స్థాయిలో మాస్ అభిమానులు లేకపోయినా నేచురల్ స్టార్ గా తనకుతాను తనసొంత ఇమేజ్ ని క్రియేట్ చేసుకుని ప్రస్తుతం టాప్ యంగ్ హీరోల స్థానానికి గురిపెడుతున్న విషయం తెలిసిందే. నాని సూపర్ స్టార్ కాకపోయినా ‘బిగ్ బాస్’ షోను హోస్ట్ చేయడం ద్వారా బుల్లితెర సూపర్‌ స్టార్‌ గా మారి తనఅభిమానుల సంఖ్యను మరింత పెంచుకోవాలని ప్రయత్నించాడు. అయితే నాని ‘బిగ్ బాస్’ హోస్ట్ అయ్యాడు కానీ ఈషోపై ఇప్పటికీ తనపట్టును పెంచుకోలేక పోవడంతో నానీని టార్గెట్ చేస్తూ మీడియా నుండి సామాన్యుడు వరకు చేస్తున్న మాటలదాడి రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది. 
Nani tak es upon the host’s duty for Bigg Boss 2 Telugu in the new season.
దీనికి కారణం ఈషోను నిర్వహించడంలో నాని అనుసరిస్తున్న తీరు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ‘బిగ్ బాస్’ షోను నానీ హోస్ట్ చేస్తున్నాడు కాబట్టి టివి కెమెరాల ముందుకు రాగానే నాని సూపర్ స్టార్ లా ఫీల్ అవ్వాలి కానీ అలా కాకుండా తన ఒరిజినల్ స్టైల్ లోనే నాని కనిపిస్తూ ఈషోపై ఇప్పటికీ పూర్తి కమాండ్ ప్రదర్శింపలేకపోవడం ఒకవిధంగా నాని అసమర్ధతగా మారింది అన్నఅభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈషో ప్రారంభం అయిన దగ్గర నుండి నాని ఒక వారమైనా బాగా చేస్తాడు అని అనుకుంటే వారాలు గడిచిపోతున్నా నాని తీరులో మార్పులేకపోవడం బుల్లితెర ప్రేక్షకులకు తీవ్ర అసహనంగా మారింది అన్న కామెంట్స్ వస్తున్నాయి.
new promo of nani's upcoming show bigg boss telugu season 2 released
దీనికితోడు నాని ‘బిగ్ బాస్’ లోని కంటెస్టెంట్స్‌ కి భయం కలిగించ లేకపోతున్నాడు అన్న కామెంట్స్ కూడ వినిపిస్తున్నాయి. దీనికి ఉదాహరణగా ఈషోలోని చాలామంది హౌస్‌ మేట్స్‌ నానీని ఏకవచనంలో సంభోదించడం అతడిని ఏకవచనంలోనే సంబోధించడం ఈషోని చూస్తున్న వారికి మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇదిఇలా ఉంటే నాని ముందు నుంచి కాస్త కటవుగా వ్యవహరిస్తే హౌస్ మేట్స్ అంతా ఇప్పటికే ఒకదారిలో పడేవారని అయితే నాని తన పై విమర్శకుల దాడి పెరిగిన తరువాత ఇప్పుడు నష్ట నివారణ చర్యలు చేపట్టి హౌస్ మేట్స్ ను దారిలో తెచ్చుకునే పని ఆలస్యంగా మొదలు పెట్టాడు అని అంటున్నారు. 
నాకూ ఇదొక అలవాటుగా మారింది: నాని
మరీ ముఖ్యంగా తేజస్వి విషయంలో నానీని తన సమఉజ్జీగా భావిస్తూ నానీ పై జోక్స్ వేస్తున్నా తిరిగి తేజస్వికి చురకలు అంటించడంలో నాని ఫెయిల్ అయ్యాడు అన్న కామెంట్స్ కూడ వస్తున్నాయి. ఇదిచాలదు అన్నట్లుగా హోస్ట్ స్థానంలో ఉన్న నాని బాబు గోగినేనితో మాట్లాడుతూ అతడి పట్ల మితిమీరిన గౌరవాన్ని ప్రదర్శిస్తున్న నేపధ్యంలో మేధావిగా పేరుగాంచిన బాబు గోగినేని అంటే నాని భయపడుతున్నాడా అన్న సందేహాలు కూడ కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఇలా రకరకాల కారణాలతో ఏవారం రాణించ లేకపోతున్న నాని వ్యవహార శైలి వల్ల ‘బిగ్ బాస్’ రేటింగ్స్ తగ్గిపోవడమే కాకుండా ‘ఏమైనా జరగవచ్చు’ అని చెప్పే బిగ్ బాస్ ట్యాగ్ లా ‘బిగ్ బాస్’ కార్యక్రమం ఫెయిల్ కూడ అవ్వవచ్చు అని కామెంట్స్ వస్తున్న పరిస్థుతులలో నానీని హోస్ట్ గా తప్పించి మరెవ్వరినైనా ఈకార్యక్రమానికి హోస్ట్ గా పెట్టమని ‘స్టార్ మా’ ఛానల్ కు మెసేజ్ లు పెడుతున్నట్లు టాక్..    


మరింత సమాచారం తెలుసుకోండి: