తెలుగు ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఎన్టీఆర్’బయోపిక్.   బాలకృష్ణ ప్రధాన పాత్రలో క్రిష్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై అప్పుడే భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి.   ఇప్పటికే బాలీవుడ్, టాలీవుడ్ లో సినీ తారలపై బయోపిక్ చిత్రాలు వచ్చాయి.  తెలుగులో మహానటి, హిందీ లో సంజు చిత్రాలు మంచి విజయం సాధించాయి. 
Image result for balakrishna son mokshagna
తాజాగా ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం ఎలా ఉండబోతున్నాయో అని అభిమానుల్లో ఉత్సహం పెరిగిపోయింది.  క్రిష్ దర్శకత్వంలో 'ఎన్టీఆర్' బయోపిక్ కి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమాలో యంగ్ ఎన్టీఆర్ గా శర్వానంద్ కనిపించే అవకాశం వున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ అందులో నిజం లేదని తెలుస్తోంది. యంగ్ ఎన్టీఆర్ గా మోక్షజ్ఞ కనిపిస్తేనే నందమూరి అభిమానులు సంతృప్తి చెందుతారని బాలకృష్ణతో క్రిష్ చెప్పారట.
Image result for balakrishna son mokshagna
అంతే కాదు ఎన్టీఆర్ బయోపిక్ ద్వారా  మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తే బాగుంటుందని భావించిన బాలకృష్ణ .. అందుకు మోక్షజ్ఞను సిద్ధం చేస్తున్నారని అంటున్నారు. మోక్షజ్ఞ కాస్త బొద్దుగా ఉంటాడు .. ఈ సినిమాలో పాత్ర కోసం ఆయన కాస్త సన్నబడితే బాగుంటుందని క్రిష్ సూచించాడని చెబుతున్నారు.  అయితే  మోక్షజ్ఞ ఫిట్ నెస్ కోసం సింగపూర్ వెళ్లాడని అంటున్నారు. ఈ సినిమాలో హరికృష్ణ .. కల్యాణ్ రామ్ కూడా ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నట్టు తెలుస్తోంది.   


మరింత సమాచారం తెలుసుకోండి: