టాలీవుడ్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై పోరాటం చేస్తున్న నటి శ్రీరెడ్డి కొద్ది రోజుల నుంచి ఇంటికే పరిమితం అయ్యింది.  ఇంటి నుంచే తన ఉద్యమాన్ని కొనసాగిస్తున్నానని చెబుతున్న శ్రీరెడ్డి సోషల్ మాద్యమాల్లో సంచలన వ్యాఖ్యలు, ట్విట్స్ చేస్తూ వస్తుంది.  తాజాగా కమెడియన్ షకలక శంకర్ పై విరుచుకుపడింది. అతడికి తన స్టైల్ లో వార్నింగ్ కూడా ఇచ్చింది.  ఈ మద్య జబర్ధస్త్ కమెడియన్ షకలక శంకర్ ‘శంభో శంకర’సినిమాలో నటించిన విషయం తెలిసిందే.  ఈ సినిమా  శుక్రవారం రిలీజ్ అయ్యింది.  అయితే ఈ సినిమా రిలీజ్ సందర్భంగా పలు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. 
Image result for shakalaka shankar
ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..తాను ఈ సినిమా కథ తీసుకు వెళ్లి త్రివిక్రమ్, దిల్ రాజు, రవితేజల వద్ద ప్రస్తావించినా లాభం లేక పోయిందని ఇండస్ట్రీలో నువ్వు హీరోవి అవుతున్నావా అని వెక్కిరించిన వారే అంటూ ఆవేదన చెందాడు.  తర్వాత మరో ఇంటర్వ్యూలో ఇదంతా ప్రమోషన్ స్టంట్ అంటూ కొట్టి పడేశారు షకలక శంకర్. ఇదిలా ఉంటే ఓ పత్రికలో ఆఫర్లు మనల్ని వెతుక్కుంటూ రావు..అందుకోసం అల్లరి చేసి ఇండస్ట్రీని బ్లేబ్ చేసేవాళ్లు చాలా మంది ఉన్నారని వార్తలు వచ్చాయి. 
Image result for shakalaka shankar
దీనిపై స్పందించిన ఇప్పటివరకు నేను ఎదగడానికి, ఫేమస్ అవ్వడానికి ఎవరి పేరును వాడుకోలేదు. నా ఎదుగుదల కోసం పక్క వారిపై ఆధారపడలేదు. కానీ ఇప్పుడు ఒక హీరో భక్తులు బయలుదేరారు. ఆ హీరోకి తెలుసో తెలియదో గానీ అతడి పేరు చెప్పుకొని అతడు రాజకీయంగా రాణించాలి అంటూ అతడిపై బ్రతికేస్తున్నారు.

తన సినిమా పబ్లిసిటీ కోసం అతడి ఫ్యాన్స్ ను కూడా వాడేస్తున్నారు.  మీ చెత్త పబ్లిసిటి కోసం ఇతరులను వాడుకోవడం అనేది ఛండాలంగా ఉందని..పైగా నా పేరు మధ్యలో తీసుకొస్తున్నారు. ఇకపై అలా చేస్తే పళ్ళు రాలగొట్టి చేతిలో పెడతా.. అవకాశాల కోసం రోడ్డున పడలేం కదా అంటూ ఏదేదో వాగుతున్నావనే విషయం నా వరకు వచ్చింది. కమెడియన్ నుండి హీరోగా సినిమా చేశావు. నువ్వేం గొప్పోడివి కాదు.. నీ ప్రొడ్యూసర్ కూడా పెద్ద గొప్పోడు కాదు. మీ కథలు, మీ ప్రొడ్యూసర్ కథలు కూడా బయటకు వస్తాయంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: