అల్లు అరవింద్ ఏమాటలు మాట్లాడినా ఎటువంటి ఆవేశాలకు లోను కాకుండా చాలా వ్యూహాత్మకంగా మాట్లాడతాడు. దీనితో అరవింద్ ఏదైనా కామెంట్స్ చేస్తే ఆ మాటల వెనుక అర్ధాలు గురించి ఇండస్ట్రీ వర్గాలలో చాలా చర్చలే జరుగుతూ ఉంటాయి. ఇది ఇలా ఉండగా ‘తేజ్ ఐ లవ్యూ’ ప్రి రిలీజ్ ఈవెంట్లో అరవింద్ ఒక ఆసక్తికర విషయం బయటపెట్టాడు.  
చిరంజీవి సినిమాల విషయంలో పోటీ పడ్డాం
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఫ్లాపవుతాయని తెలిసి కూడా కొన్ని సినిమాలు గతంలో చేసాడని ఆసినిమాల ఫలితాల గురించి కూడ ముందే తేజ్ తనతో చెప్పాడని అంటూ ఆసక్తికర కామెంట్స్ చేసాడు. కెరీర్ ఆరంభంలో ‘పిల్లా నువ్వు లేని జీవితం’ ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ ‘సుప్రీమ్’ సినిమాలతో హ్యాట్రిక్ హిట్లతో ఊపు మీద కనిపించిన తేజ్ ఆ తర్వాత గాడి తప్పాడు అన్న విషయాన్ని అన్యాపదేశంగా ఒప్పుకుంటూ ‘తిక్క’ ‘విన్నర్’ ‘నక్షత్రం’ ‘జవాన్’ ‘ఇంటిలిజెంట్’ ఇలా వరుసగా ఐదు ఫ్లాప్ లను సాయి ధరమ్ తేజ్ ముందే ఊహించాడు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు అరవింద్. 
‘తేజ్ ఐ లవ్ యూ’ ట్రైలర్ బావుంది
అయితే తేజ్ సినిమాలు అటు ఇటు అవుతుండటంతో అతడికేమైంది అని వివారలలోకి వెళ్ళితే ఇచ్చిన మాటకోసం తేజ్ ఫ్లాపులను మోయాలి వచ్చింది అని తెలిసి తానూ షాక్ అయ్యాను అంటూ ఆసినిమాలు పోతాయని తెలిసినా మాట తప్పడం ఇష్టం లేక సాయి ధరమ్ తేజ్ ఆసినిమాలు చేసాడు కాని మెగా మేనల్లుడి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు అంటూ వ్యూహాత్మక కామెంట్స్ చేసాడు అరవింద్.  ఒక దర్శకుడు ఒక ఫ్లాప్ సినిమా తీస్తే హీరోలు అంతకుముందు ఇచ్చిన మాటతీసి పక్కన పెట్టేస్తున్నారని అయితే తేజ్ మాత్రం అలా చేయకుండా కొందరు దర్శకులతో సినిమాలు పూర్తిచేసి తను నష్టపోయాడు అంటూ మెగా మేనల్లుడి పరాజయాలు ఆదర్శకుల ఖాతలలోకి తెలివిగా వేసాడు అరవింద్.    
చిరంజీవి-పవన్ కళ్యాణ్‌తో సినిమా చేస్తా
ఇదే సందర్భంలో అరవింద్ మామాట్లాడుతూ సాయి ధరమ్ తేజ్ కొన్ని దశాబ్దాల పాటు పరిశ్రమలో ఉంటాడని చెబుతూ ‘మార్క్ మై వర్డ్స్’ అని అరవింద్ మీదియాబ్ ప్రతినిధుల వంక చూసి  స్టేట్మెంట్ ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏమిటి అన్న విషయమై ఆసక్తికర చర్చలు ఇండస్ట్రీ వర్గాలలో జరుగుతున్నాయి. దీనితో అరవింద్ మార్క్ మై వర్డ్స్ ఫలితం ‘తేజ్ ఐ లవ్యూ’ తో తేలిపోతుంది అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు..  



మరింత సమాచారం తెలుసుకోండి: