మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాన్.   అక్కడ అమ్మాయి-ఇక్కడ అబ్బాయి చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాన్ మొదట్లో కెరీర్ కాస్త ఇబ్బందులతో కొనసాగింది.  తొలిప్రేమ, తమ్ముడు, గబ్బర్ సింగ్ చిత్రాలతో పవన్ కళ్యాన్ నెంబర్ వన్ హీరో రేంజ్ కి ఎదిగారు.  అయితే పవన్ కళ్యాన్ మొదటి నుంచి కాస్త దూకుడు స్వభావం అని ఆయనే పలు సందర్భాల్లో తెలిపారు.  తన చుట్టూ ఉన్నవారికి అన్యాయం జరిగితే..సహించకపోవడం..వారికి గురించి పోరాడటం చిన్ననాటి నుంచి అలవర్చుకున్న తత్వం. 
Image result for pawan kalyan chiranjeevi
అయితే ఇది కొన్ని సార్లు ఇబ్బందుల్లో పడేసిన రోజులు కూడా ఉన్నాయని..తన ఆవేశానికి, అన్యాయానికి ఎక్కడ తీవ్రవాద ఉద్యమాల్లోకి పోతాడోనన్న ఆందోళనతో, ఓ తుపాకీ కొనిస్తే ఇంట్లోనే ఉంచవచ్చని ఆలోచించి  అన్నయ్య చిరంజీవి తనకు ఓ తుపాకీని కొనిచ్చారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. విశాఖపట్నం కళావాహిని పోర్ట్ స్డేడియంలో జనసేన పార్టీ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు అక్కడి వారితో పంచుకున్నారు. 

తన అవేదన, ఆవేశం అన్యాయం మీదనే తప్ప, తుపాకీ కోసం కాదని ఆనాడు తన అన్నకు వివరించలేకపోయానని చెప్పారు. అన్నయ్య ఇచ్చిన తుపాకీ తీసుకున్నా కానీ..దాన్ని ఎలా వాడాలో కూడా తనకు తెలియదని అన్నారు.  అయితే తనకు చిన్నప్పటి నుంచి లగ్జరీ స్టైల్ అలవాటు లేదని..సామాన్యుడిగానే బతికానని అన్నారు.  ప్రభుత్వాలు ప్రజలకు తీవ్రమైన అన్యాయం చేస్తుంటే ప్రశ్నించకుండా ఎలా ఉండగలుగుతానని, రోడ్లపైకి వచ్చి నిలదీయకుండా ఎలా ఉండగలనని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: