ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.  అనారోగ్యంతో కొంత మంది, యాక్సిడెంటల్ గా కొంతమంది..ఆత్మహత్యలతో మరికొంత మంది నటులు మృతి చెందిన విషయం తెలిసిందే.  ఏది ఏమైనా నటుడిగా అందరి మన్ననలు పొందుతున్న వేల హఠాత్తుగా కాలం చేస్తే ఇండస్ట్రీల కన్నీటి పర్యంతం అవుతుంది. 

తాజాగా  హాస్యనటుడు మహేష్ గత కొంత కాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతూ.. కిమ్స్ హాస్పిటల్ లో కన్నుమూశారు.  దాదాపు వందకు పైగా చిత్రాల్లో మహేష్ హాస్య నటుడిగా తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

 సినిమాలతో పాటు, బుల్లితెర సీరియళ్లలో కూడా నటించి మెప్పించారు. కాగా మహేష్ మరణ వార్త విన్న తర్వాత పలువురు సెలబ్రెటీలు ఆయన మృతికి సంతాపం తెలిపారు.  మహేష్ మరణంతో సినిమా ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: