మెగా పవర్‌ స్టార్ రామ్‌చరణ్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ లు హీరోలుగా దర్శకుధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.   ఆర్‌ ఆర్‌ ఆర్‌ అనే వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.  ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందా అనే ఆసక్తితో అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ .. ఇటు చరణ్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Image result for yamadonga

 స్టూడెంట్ నెం.1 సినిమాతో దర్శకుడిగా రాజమౌళి, హీరోగా ఎన్టీఆర్ కెరీర్ ప్రారంభించారు.  తర్వాత ఎన్టీఆర్ తో సింహాద్రి, యమదొంగ టాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తీశారు రాజమౌళి.  ఇక బాహుబలి, బాహుబలి 2 కన్నా ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రికార్డుల మోగ మోగించిన సినిమా ‘మగధీర’. రాంచరణ్,కాజల్ జంటగా నటించిన ఈ సినిమా రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీశారు.  అందకు తగ్గ రిజల్ట్ కూడా వచ్చింది.  

Image result for magadheera

అయితే బాహుబలి 2 సినిమా తర్వాత రాజమౌళి చాలా గ్యాప్ తీసుకొని ఎన్టీఆర్, రాంచరణ్ లతో మల్టీస్టారర్ సినిమా తీయబోతున్న విషయం తెలిసిందే.  అయితే ఈ సినిమా కు సంబంధించి ఎలాంటి అప్ డేట్స్ బయటకు రావడం లేదు. ఈ క్రమంలో నవంబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందనేది తాజా సమాచారం.

Image result for rajamouli ntr charan

 అయితే చరణ్, బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తుండటం ఎన్టీఆర్, త్రివిక్రమ్‌ దర్శకత్వంలో అరవింద సమేత చేస్తుండటంతో రాజమౌళి సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందన్న చర్చ జరుగుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. నవంబర్ నుంచి ఎన్టీఆర్ .. డిసెంబర్ నుంచి చరణ్ ఈ సినిమా షూటింగులో పాల్గొననున్నట్టు చెబుతున్నారు. ఇక కథానాయికలుగా ఎవరికి ఛాన్స్ దక్కనుందనేది చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: