తెలుగు ఇండస్ట్రీలో తేజ దర్శకత్వంలో హీరో నితిన్ నటించిన ‘జయం’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది సదా.  తర్వాత కొన్ని చిత్రాల్లో వచ్చినప్పటికీ..పెద్దగా పేరు తెచ్చుకోలేక పోయింది.  తెలుగు, తమిళ ఇండస్ట్రీలో నటించిన సదా తాజాగా ‘టార్చిలైట్’ చిత్రంలో నటిస్తుంది.  ఈ చిత్రంలో సదా ఒక వేశ్యపాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. 
Related image
తన కెరీలోనే తొలిసారి వేశ్య పాత్రను ఈ సినిమాలో పోషించింది సదా.  అయితే ఈ చిత్రం ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉన్నా.. కొన్ని పోస్ట్ ప్రొడక్షన్ కారణాలతో ఈ చిత్రం విడుదలలో జాప్యం జరుగుతోంది. ఇదిలా ఉంటే..కొన్ని వారాల క్రితమే ఈ చిత్రాన్ని సెన్సార్ కు పంపారు..అయితే ఈ చిత్రంలో అశ్లీలత మోతాదు చూపించాల్సిన దానికన్నా ఎక్కువ చూపించారని..ఇది సమాజంలో చెడుకు దారి తీయవొచ్చన్న కారణంతో సర్టిఫికేట్ ఇవ్వడానికి బోర్డు నిరాకరించింది. 
Image result for sada Torchlight
దాంతో తాము సినిమాకు ఎంతో పెట్టుబడి పెట్టామని..రిలీజ్ కాకపోతే తాము నష్టాల్లో కూరుకు పోతామని..దర్శకనిర్మాతలు ఢిల్లీలో ట్రైబ్యునల్ ను ఆశ్రయించి... సర్టిఫికేట్ తెచ్చుకున్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ తో 'తమిళన్' సినిమాను తెరకెక్కించిన ఎ.మజీద్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: