గీతాంజలి, రాజుగారి గది, ఆనందోబ్రహ్మ లాంటి చిత్రాల్లో కమెడియన్‌గా మంచి పేరు సంపాదించుకొన్న షకలక శంకర్ మరో అడుగు ముందుకు వేసి శంభో శంకర చిత్రంతో హీరోగా మారారు. డైరెక్టర్ శ్రీధర్ రూపొందించిన ఈ చిత్రానికి నిర్మాతలుగా రమణారెడ్డి, సురేష్ కొండేటి వ్యవహరించారు. శంకర్ సరసన కారుణ్య చౌదరి నటించారు.  హీరోగా తాను చేసిన తొలిచిత్రం పక్కాగా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని కమెడియన్ శకలక శంకర్ చెప్తే ఏమో అనుకున్నాం… నిజంగానే ఇది చరిత్రలో గుర్తిండిపోయే సెన్సేషన్ క్రియేట్ చేసింది. 
శంభో శంకర్ స్టోరి
రైతులు, ఇతర సమస్యలను ఆధారంగా చేసుకొని రూపొందించిన ఈ చిత్రం జూన్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కమెడియన్ ప్రేక్షకులను ఇప్పటికే మెప్పించిన శకలక శంకర్ హీరోగా మారడం పై పలువురు పెదవి విరిచారు.  ఇదిలా ఉంటే.. శకలక శంకర్ నటించిన ‘శంభో శంకర’చిత్రం యూఎస్ లో ఓ సంచలనం సృష్టించింది. కాకపోతే భారీ వసూళ్ళతో కాదులెండి.. అత్యంత చెత్త కలెక్షన్లతో భారీ డిజాస్టర్ పాలయ్యింది.
సెకండాఫ్ అనాలిసిస్
ట్రేడ్ వర్గాల రిపోర్ట్ ప్రకారం.. ఈ చిత్రం యుఎస్‌లో ప్రీమియర్స్‌తో కలిపి మొత్తం రెండు రోజుల్లో కేవలం $79 (రూ.5,407) మాత్రమే కలెక్ట్ చేసింది. ట్రేడ్ నిపుణుల అంచనా ప్రకారం.. ఈ చిత్రం $100 లోపే  దుఖానం క్లోజ్ చేస్తుందని అంటున్నారు.   శకలక శంకర్‌కి పెద్దగా మార్కెట్ లేదు. ఇక యుఎస్ ఆడియెన్స్ ఇలాంటి చిత్రంపై ఎలా దృష్టి పెట్టాలో అలాగే పెట్టారు.  ఈ చిత్రం ఏమాత్రం ఆకట్టుకోకపోవడంతో వాళ్ళు మొదట్లోనే ఈ మూవీని రిజెక్ట్ చేశారు. అందుకే.. యుఎస్ బాక్సాఫీస్ వద్ద అతి తక్కువ గ్రాస్ కొల్లగొట్టిన తెలుగుచిత్రంగా ఈ మూవీ చరిత్ర సృష్టించింది.


రోజువారీ గా కలెక్షన్లు :
ప్రీమియం    : $ 10
శుక్రవారం    : $40
శనివారం    : $29
టోటల్ గా    : $70 (రూ.5,407)



మరింత సమాచారం తెలుసుకోండి: