‘అర్జున్ రెడ్డి’ మూవీ ఘన విజయంతో యూత్ కు ఐకాన్ గా మారిపోయిన విజయ్ దేవరకొండ తనకు యూత్ లో ఏర్పడ్డ క్రేజ్ ను మరింత పెంచుకోవడానికి అనేక వ్యూహాత్మక ప్రయోగాలు చేస్తున్నాడు. వేల సంఖ్యలో ఉన్న తన వీరాభిమానుల కోసం ఏకంగా వెబ్ సైట్ ను లాంచ్ చేసిన విజయ్ తన అభిమాన సంఘానికి ‘రౌడీ క్లబ్.ఇన్’ ని లాంచ్ చేశాడు. 
vijay devarakonda taxi wala teaser Latest 2018 - Sakshi
లేటెస్ట్ గా జులై 15న తన రౌడీస్ కోసం మొదటిసారిగా ‘సన్ డౌనర్’ పార్టీని విజయ్ అనౌన్స్ చేయడం సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన పోస్టర్ ను విజయ్ డిజైన్ చేయించి సోషల్ మీడియాలో షేర్ చేసాడు. ఇప్పుడు ఆ పోస్టర్ యూత్ మధ్య వైరల్ గా మారింది. 
vijay devarakonda taxi wala
బేర్ బాడీతో షర్ట్ లేకుండా టోర్న్ జీన్స్ వేసుకున్న విజయ్ ఫొటో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అసలు సిసలైన రౌడీలా యమహా బైక్ ను రైడ్ చేస్తూ రోడ్ పై  షర్ట్ లేకుండా వెళుతోన్న విజయ్ ఫొటో ప్రస్తుతం యూత్ మధ్య ట్రెండిగ్ గా మారింది. సినిమాలలోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడ చాల బోల్డ్ గా ఉండే విజయ్ దేవర కొండ తన అభిమానుల సంఖ్యను పెంచుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. 

గతంలో చాలామంది హీరోలు ఫ్యాన్స్ క్లబ్ లను మెయింటెన్ చేసేవారు. అయితే ఇప్పుడు ఆ ట్రెండ్ పెద్దగా లేకపోయినా ఆ పద్ధతి విజయ్ మళ్ళీ మొదలుపెట్టడంతో విజయ్ దేవరకొండ పేరుతో త్వరలోనే చాల ఆన్ లైన్ ఫ్యాన్ క్లబ్ లు ఏర్పడే అవకాశం ఉంది. ఈ సంవత్సరంలో విడుదల కాబోతున్న ఇతడి సినిమాలు ‘గీత గోవిందం’ ‘టాక్సీవాలా’ ‘నోటా’ లు విజయవంతం అయితే ఇతడి మ్యానియా మరింత పెరగటం ఖయాం..   



మరింత సమాచారం తెలుసుకోండి: