తెలుగు ఇండస్ట్రీలో ఈ మద్య వరుసగా ఓకే రోజు చిత్రాలు రిలీజ్ కావడం..అందులో ఏదో ఒక చిత్రం మాత్రమే మంచి పేరు తెచ్చుకోవడం జరుగుతుంది.   గత వారం అయితే ఏకంగా ఏడు సినిమాలు రిలీజ్ అయ్యాయి.  హిట్, ఫ్లాప్ అనే తేడా లేకుండా ఒకే రోజు చిత్రాలు థియేటర్లో సందడి చేయడంతో ప్రేక్షకులు కాస్త కన్ఫ్యూజ్ కి కూడా గురి అవుతున్నారు.   గత శుక్రవారం  రిలీజ్ అయిన ఏ ఒక్క చిత్రం కూడా పెద్దగా సక్సెస్ కాలేదు..దాంతో ప్రేక్షకులు నిరాశలో ఉన్నారు. 
Image result for kalyan dev vijetha
ఈ సంవత్సరం బిగ్గెస్ట్ హిట్ చిత్రాలుగా రంగస్థలం, భరత్ అనే నేను, మహానటి తర్వాత ఆ స్థాయిలో హిట్ చిత్రాలు ఏ ఒక్కటీ రాలేదు. ఇదిలా ఉంటే రేపటి శుక్రవారం చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ ని హీరోగా లాంచ్ చేస్తూ సాయి కొర్రపాటి నిర్మించారు. ఇదే రోజు మరో సినిమా అజయ్ భూపతి దర్శకత్వం వహించిన  అరెక్స్ 100.  వింటేజ్ బైక్ గా యూత్ మనసులో మిగిలిపోయి ఇప్పుడు వాడుకలో లేని మోడల్ ని పేరుగా పెట్టుకుని టైటిల్ తోనే ఆకట్టుకున్నాడు.
Image result for rx 100 movie
అంతే కాదు ట్రైలర్ కి అయితే విపరీతమైన క్రేజ్ వచ్చింది.  ట్రైలర్స్ లో లవ్ రొమాన్స్ తో పాటు కావాల్సినంత యాక్షన్ మసాలా బాగానే చూపించాడు. ఈ సినిమా ప్రమోషన్ టార్గెట్ చేసిన యూత్ కి బాగా రీచ్ అయిపోయింది.  కాకపోతే హీరో కార్తీక్ గుమ్మకొండ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ తో సహా అందరు కొత్తవారే కావడంతో మొదటిరోజే సినిమా చూస్తారా అన్నదే కాస్త ఆలోచించాల్సిన విషయం.   
Image result for karthi chinababu
మరుసటి వస్తున్న డబ్బింగ్ మూవీ చినబాబుపై భారీ కాదు  కానీ ఓ మోస్తరు అంచనాలు అయితే ఉన్నాయి. పల్లెటూరి నేపధ్యంలో ఊర తమిళ బ్యాక్ డ్రాప్ తీసిన ఈ మూవీ  మనవాళ్లకు ఎంత వరకు నచ్చుతుందో ఇప్పుడే చెప్పడం కష్టం.  ఈ సినిమాకు  పాండిరాజ్ దర్శకత్వం  వహిస్తున్నారు. ఈ ట్రయాంగిల్ వార్ లో ఎవరు గెలుస్తారో తెలియాలంటే శుక్రవారం దాకా ఆగాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: