కొత్త నటులతో ఈ మద్య తెలుగు  చిత్రాల జోరు బాగా పెరిగిపోయింది.  ఈ నేపథ్యంలో  కార్తికేయ, పాయల్‌ రాజ్‌పుట్‌ నాయకానాయికలుగా అజయ్‌ భూపతి దర్శకత్వంలో అశోక్‌రెడ్డి గుమ్మకొండ నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దగ్గర శిష్యరికం చేసిన అజయ్ భూపతి దర్శకుడిగా మారి రూపొందించిన చిత్రం 'Rx 100'. ఈ సినిమా పోస్టర్లు, ట్రైలర్లతో ప్రేక్షకుల్లో మంచి హైప్ క్రియేట్ చేయగలిగింది.
RX 100 Movie NEw Stills
డైరెక్టర్, హీరో, హీరోయిన్, ప్రొడ్యూసర్ ఇలా చిత్రానికి పని చేసిన దాదాపు అందరూ కూడా కొత్తవారే. ఈ నెల 12న మంచి అంచనాల మధ్య ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ వారాంతానికి బరిలో ఇంకో రెండు సినిమాలున్నా.. దీనిపైనే అంచనాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జోరుగా జరుగుతున్నాయి. 
RX 100 Movie NEw Stills
120కి పైగా లొకేషన్లలో ‘ఆర్ ఎక్స్ 100’ రిలీజవుతుండటం విశేషం. అమెరికాలో వందకు పైగా లొకేషన్లలో చిత్రాన్ని విడుదల చేయడమంటే మాటలు కాదు.స్టార్ హీరోలకు మాత్రం ఈ రేంజ్ రిలీజ్ ఉంటుంది. ఇంతకుముందు ‘క్షణం’..‘పెళ్లిచూపులు’.. ‘అర్జున్ రెడ్డి’.. లాంటి చిన్న సినిమాలు విడుదలకు ముందు అమెరికాలో ఇలాగే హైప్ తెచ్చుకున్నాయి.
RX 100 Movie NEw Stills
కొంచెం పెద్ద స్థాయిలోనే రిలీజయ్యాయి. ‘ఆర్ ఎక్స్ 100’ అక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు కొత్త తరహా చింత్రంగా ఉండటం.. దీని ప్రోమోలు ఆసక్తి రేకెత్తించడంతో అన్ని స్క్రీన్లు దక్కుతున్నాయి. ఇక సినిమాలో యూత్ ని ఆకర్షించేలా లిప్ లాక్ సీన్లు బాగానే చూపిస్తున్నట్లు కనిపిస్తుంది. 
RX 100 Movie NEw Stills
ట్రైలర్ చూసిన వారంతా సినిమాలో ఎక్కువ రొమాన్స్..ఘాటైన సీన్లు ఉన్నాయని అంటున్నారు.  ఈ చిత్రానికి మంచి టాక్ వస్తే ఊహించిన రేంజికి వెళ్తుందేమో. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కార్తికేయ-పాయల్ రాజ్ పుత్ జంటగా నటించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: