తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోల వారసులు ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.  ఇందులో కొద్ది మంది మాత్రమే సక్సెస్ అవుతున్నారు.  వివివినాయక్ దర్శకత్వంలో ‘అఖిల్’చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అక్కినేని అఖిల్.  ఈ చిత్రంలో  డ్యాన్స్, ఫైట్స్ లో దుమ్మురేపి హీరోగా మంచి మార్కులు కొట్టేశాడు.  కానీ బ్యాడ్ లక్ చిత్రం మాత్రం బాక్సాఫీస్ వద్ద బోర్లా పడింది. 

ఇక  తర్వాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన హలో సినిమా కూడా కమర్షియల్ గా దెబ్బ కొట్టింది.  దాంతో మనోడి ఇప్పుడు మూడో సినిమాపై దృష్టి కేంద్రీకరించారు.   అఖిల్‌ ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో వస్తున్న ఓ చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ లండన్‌లో జరుగుతోంది. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. 

 ఈ మద్య కొన్ని అభిప్రాయ భేదాల వల్ల అఖిల్‌కు, వెంకీకి మధ్య గొడవలు వచ్చాయని, దాంతో సినిమా నుంచి ఇద్దరూ తప్పుకోవాలని అనుకుంటున్నారని వార్తలు వెలువడుతున్నాయట. ఈ విషయాన్ని అఖిల్‌, వెంకీ వెల్లడిస్తూ ఓ ఫన్నీ వీడియోను రూపొందించారు. నాకు ఈయనకు గొడవ జరిగిందని వస్తున్న వార్తలన్నీ నిజమే అని చెప్పడానికి ఈ వీడియో పోస్ట్‌ చేస్తున్నాను’ అని సీరియస్‌గా వెల్లడిస్తూ.. ఒక్కసారిగా ఇద్దరూ పగలబడి నవ్వుకున్నారు.

షాట్‌ రెడీ అనగానే అఖిల్‌ వెంకీకి ముద్దుపెట్టడం దానికి ఎలా స్పందించాలో తెలీక వెంకీ అటూ ఇటూ చూడటం నవ్వులు పూయిస్తోంది. సో...అఖిల్ సినిమా మంచి రోమాంటిక్ మోడ్ లో కొనసాగుతందని తెలిసిపోయింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: