నిన్న విడుదల అయిన ‘విజేత’ కు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన రావడంతో ఈమూవీ అనుకున్న స్థాయిలో విజయవంతం కాదు అన్న విషయమై క్లారిటీ వచ్చేసింది. అయితే ఈసినిమాను ఏదోవిధంగా నిలబెట్టాలి అన్న ఉద్దేశ్యంతో కళ్యాణ్ దేవ్ ఈమూవీ ప్రమోషన్ ను అత్యంత ఉత్సాహంగా కొనసాగిస్తూ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ధైర్యంగా సమాధానం ఇస్తున్నాడు.
కల్యాణ్ దేవ్ విజేతనే
ఈ సందర్భంలో కళ్యాణ్ దేవ్ ను ఒక మీడియా సంస్థ ప్రతినిధి ఈ సినిమా విషయంలో చరణ్ నుండి అందిన సహకారం పై ప్రశ్నించినప్పుడు కళ్యాణ్ దేవ్ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. వాస్తవానికి ఈసినిమా ముందు చరణ్ తనకు ఎలాంటి సలహాలు ఇవ్వలేదని చెపుతూ సినిమా పూర్తి అయిన తరువాత ఈమూవీ ప్రమోషన్ విషయంలో మాత్రం సలహాలు ఇచ్చాడు అంటూ అసలు విషయం బయటపెట్టాడు. 
ప్రొడక్షన్ వ్యాల్యూస్
తన మామయ్య చిరంజీవి మాత్రం ఈమూవీకి సంబంధించి కథ వినడం దగ్గర నుండి రషెష్ చూడటం వరకు అన్నీ దగ్గర ఉండి చూసుకున్న విషయాన్ని తెలియచేసాడు. అయితే తన భార్య శ్రీజ మాత్రం తనకు ఏమీ సలహాలు ఇవ్వలేదని అంటూ ఆమెకు సినిమాల పై పెద్దగా ఆసక్తి లేదు అన్న విషయాన్ని బయటపెట్టాడు ఈ మెగా అల్లుడు. 
ఫైనల్‌గా
ఇదే మీడియా ఇంటర్వ్యూలో కళ్యాణ్ దేవ్ మాట్లాడుతూ ఈసినిమా నిర్మాత కొర్రపాటి సాయి తాను ఎవరో తెలియకుండా అవకాసం ఇచ్చారని అంటూ సినిమాకు సంబంధించిన పనులు మొదలయ్యేదాకా తాను చిరంజీవి అల్లుడుని అన్న విషయం కొర్రపాటి సాయికి తెలియదు అని చెప్పడం కొద్దిగా అతిగా అనిపించింది అని మీడియా వర్గాలు కామెంట్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కథలో కొత్తదనం లేకుండా పాత కథను నమ్ముకుని కళ్యాణ్ దేవ్ చేసిన ఈమూవీ సక్సస్ పై డివైడ్ టాక్ నడుస్తున్న నేపధ్యంలో కళ్యాణ్ దేవ్ విజేత కాలేదనే అనుకోవాలి..   


మరింత సమాచారం తెలుసుకోండి: