అఖిల్ లేటెస్ట్ గా వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటిస్తున్న సినిమా విషయంలో ఆమూవీ దర్శకుడుతో విభేదాలు ఏర్పడ్డాయి అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ వార్తలు ఇలా ప్రచారానికి రావడంతో అసలు అఖిల్ కు అన్నదమ్ముల సెంటిమెంట్ శాపంగా మారుతోందా అంటూ ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.

ఈ చర్చలకు తెర తీస్తున్న కొందరి అభిప్రాయాల ప్రకారం ఒక్క మెగా ఫ్యామిలీలో తప్ప మరి ఏఇతర టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖుల కుటుంబాలలో అన్నదమ్ములు ఇద్దరు హీరోలుగా రాణించిన సందర్భాలు లేవు అంటూ ఒక సరికొత్త చర్చకు తెర తీస్తున్నారు. వీరి అభిప్రాయాల ప్రకారం నందమూరి కుటుంబంలో బాలకృష్ణ-హరికృష్ణ హీరోలుగా ఎంట్రీ ఇచ్చినా హరికృష్ణ వెనకబడి బాలయ్య టాప్ హీరోగా మారడం దగ్గర నుండి అదే కుటుంబానికి చెందిన కళ్యాణ్ రామ్-జూనియర్ లలో జూనియర్ టాప్ హీరోగా ఎదగడాన్ని ఉదాహరణగా చూపెడుతున్నారు. 
Akhil Is A Patient Man
అదేవిధంగా సూపర్ స్టార్ కృష్ణ కొడుకులు రమేశ్-మహేష్ లు హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన పరిస్థుతులలో మహేష్ సూపర్ స్టార్ అయితే రమేశ్ కనుమరుగై పోవడాన్ని మరో ఉదాహరణగా చూపెడుతున్నారు. ఇక అల్లు వారి కుటుంబంలో అల్లు అర్జున్ అల్లు శిరీష్ లలో బన్నీ స్థాయికి శిరీష్ చేరుకోకపోవడం కూడ మరొక ఉదాహరణగా చూపెడుతున్నారు. దర్శకుడు ఈవివి సత్యనారాయణ కొడుకులలో ఆర్యన్ రాజేష్ ను జనం మర్చిపోతే అల్లరి నరేశ్ కు మాత్రం అల్లరోడిగా ఇప్పటికీ క్రేజ్ కొనసాగడం తమ వాదానికి పనికొచ్చే విషయంగా చూపెడుతున్నారు. 
gallery
ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీ కుటుంబాల చరిత్ర చూసుకుంటే ఆ ఫ్యామిలీల నుండి వచ్చిన అన్నదమ్ములలో ఒక్కరు మాత్రమే విజయాలు సాధించిన సందర్భాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు అదే సెంటిమెంట్ అఖిల్ ను కూడ వెంటాడుతూ ఉండటంతో రెండు భారీ సినిమాలు చేసినా అఖిల్ కు కాలం కలిసిరాలేదా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అఖిల్ తో పోల్చుకుంటే చైతన్య ఇప్పటికే హీరోగా మంచి మార్కులు వేయించుకుంటున్న నేపధ్యంలో ఆస్థాయికి అఖిల్ ఎదగాలి అంటే ఇంకా ఎంత కాలం ఆగాలో రానున్న కాలానికే తెలియాలి..   


మరింత సమాచారం తెలుసుకోండి: