తెలుగు ఇండస్ట్రీలో మాస్ ప్రేక్షకుల అభిమాన హీరో మెగాస్టార్ చిరంజీవి.  కామన్ పీపుల్స్ కి రీచ్ అయ్యేలా ఆయన పలు చిత్రాల్లో నటించాడు.  చిరు అంటే మాస్ అనే స్థాయికి వచ్చారు కనుకనే ఆయన మెగాస్టార్ అయ్యారు.  చిరంజీవి తర్వాత పవన్ కళ్యాన్ ఆ స్థాయికి చేరుకున్నాడు.  ఇక పవన్ తర్వాత అల్లు అర్జున్, రాంచరణ్ కాస్త మాస్ ఇమేజ్ తెచ్చుకున్నా..పెద్దాయనంత కాదు.  ప్రస్తుతం  ఇండస్ట్రీలోకి సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్, అల్లు శిరీష్ లు హీరోగా ఎంట్రీ ఎంట్రీ ఇచ్చిన పెద్దగా ఇమేజ్ తెచ్చుకోలేక పోతున్నారు. 

ఇక సాయిధరమ్ తేజ్ చిత్రాలు వరుసగా ఫ్లాప్ లు అవుతున్నాయి.  అల్లు శిరీష్ ని హీరోగానే గుర్తించడం లేదు.  వరుణ్ తేజ్ ఫిదా, తొలప్రేమ హిట్స్ తో ముందుకు సాగుతున్నాడు.  ఈ నేపథ్యంలో చిరు చిన్న అల్లుడు కళ్యాన్ దేవ్ ‘విజేత’ చిత్రంతో మొన్న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.  ఈ చిత్రానికి మిక్స్ డ్ టాక్ వచ్చింది. టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలకు ఓ ప్రత్యేకత ఉండాలని చూస్తుంటారు అభిమానులు, ఫ్యాన్స్.   ముఖ్యండా డ్యాన్స్, ఫైట్స్, ఊరమాస్ యాక్షన్..ఇదీ ఉంటేనే మెగా హీరో అవుతారని ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ అంటారు.

వాస్తవానికి మెగాస్టార్ కి ఎక్కువ శాతం మాస్ ఫాలోయింగ్ ఉంది..అందుకే ఆయన వారసులుగా వచ్చిన వారు సైతం ఆ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తుంటారు. ఫుల్ లెన్త్ మాస్ పండించొచ్చు..కానీ ఆ రేంజ్ కి ఈ కొత్త హీరో చేరలేదని అభిప్రాయం.  దాంతో తాను నటించబోయే  కొత్త సినిమాపై మొత్తం దృష్టి పెట్టాడు.  అవును.. కల్యాణ్ దేవ్ నెక్ట్స్ సినిమా ఊర మాస్ మూవీనట. 

ఇక కళ్యాన్ దేవ్ విషయానికి వస్తే.. మాస్ అప్పీల్ మచ్చుకైనా కనిపించదు. చూడ్డానికి సింపుల్ గా సాఫ్ట్ గా ఉంటాడు. సినిమాలో తన బాడీ లాంగ్వేజ్ కూడా అలానే ఉంది. ఫైట్స్ ఇరగదీయాలి, మాస్ డైలాగ్స్ చెప్పాలి. అందుకే రెండో సినిమాతో మాస్ రుద్దుడుకు రెడీ అవుతున్నాడు కల్యాణ్ దేవ్. తన రెండో సినిమాతో పాటు, దర్శకుడి వివరాలు మరో 10 రోజుల్లో వెల్లడించబోతున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: