రేణు దేశాయ్ రెండవ పెళ్ళికి రెడీ అవుతున్న నేపధ్యంలో ఆమె పై పవన్ వీరాభిమానుల దాడి కొనసాగుతూ ఉండగానే ఈవిషయాలను పట్టించుకోకుండా ఆమె ప్రస్తుతం తాను ఎంత ఆనందంగా ఉన్నానో తెలియచేస్తూ ఇన్ డైరెక్ట్ గా పవన్ అభిమానులను వ్యూహాత్మకంగా రెచ్చగొడుతోంది. తాను గడిచిన 7 సంవత్సరాలలో పొందిన వ్యధను వివరిస్తూ ఇప్పుడు తనకు కలుగుతున్న ఆనందాన్ని వివరిస్తూ ఆమె తన హడావిడి కొనసాగిస్తూనే ఉంది. 
కోరుకున్నది ఆయనే
ఇక లేటెస్ట్ గా రేణు దేశాయ్ ప్రస్తుతం తన పిల్లలు కాబోయే భర్తతో అమెరికాలో విహరిస్తునట్లు లీకులు ఇస్తోంది. పెళ్ళికి ముందే వీరంతా టూర్ కు వెళ్ళారట. ఇప్పటి వరకు ఆమె భర్త ఫోటోను డైరెక్ట్ గా క్లిక్ మనిపించకుండా డైలీ సీరియల్ లా అతడి విషయాలను కొద్ది కొద్దిగా లీక్ చేస్తోంది. ఇప్పుడు రేణు దేశాయ్ ఆమె భర్త ఎదురెదురుగా ఉన్న ఫోటోను లీక్ చేసింది. 
 మళ్ళీ అదే తంతు
అయితే ఈఫోటోలో ఆమె కాబోయే భర్త బ్యాక్ మాత్రమే కనిపిస్తోంది. ఈఫోటోను తీసింది తన కొడుకు అకిరా నందన్ అంటూ ఆమె తన ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది. తాను ఉండగానే పవన్ మరో మహిళతో బిడ్డకు జన్మనిచ్చిన విషయంలో రేణు చేసిన కామెంట్స్ వివాదాలు రేపుతున్న నేపధ్యంలో ఇప్పుడు రేణు ఈ కొత్త ట్విస్ట్ ఇవ్వడం మరో సంచలనంగా మారింది. 
అమెరికాలో కాబోయే భర్తతో
ఏకంగా అకిరానందన్ తన కాబోయే భర్త ఫోటోను తీసాడు అంటూ ఆమె చేస్తున్న కామెంట్స్ ఇప్పుడు ఎలాంటి దుమారాన్ని లేపుతాయో చూడాలి. జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే పవన్ వ్యతి రేకులకు వారు శ్రమ పడకుండానే పవన్ కు సంబంధించిన కొన్ని విషయాలు భవిష్యత్ లో రేణు నోటి వెంట వచ్చినా ఆశ్చర్యం లేదేమో అనిపిస్తోంది..   



మరింత సమాచారం తెలుసుకోండి: