నాలుగేళ్ల క్రితమే విడిపోయిన పవన్‌ రేణు దేశాయ్‌ ల మధ్య నిన్న మొన్నటి వరకు   స్నేహ సంబంధాలే కొనసాగాయి అన్నది ఓపెన్ సీక్రెట్. తామిద్దరం విడిపోయినా   స్నేహితులమేనంటూ రేణు దేశాయ్‌ పలుమార్లు ఓపెన్ గా కామెంట్స్ చేసింది. అంతేకాదు ఈమధ్య వరకు పవన్‌ పాత ఫోటోలను సోషల్ మీడియాలో  షేర్‌ చేస్తూ అతనిపై తనకున్న ఆరాధనను చాటుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. 
 మళ్ళీ అదే తంతు
అయితే అనూహ్యంగా  రేణు తన రెండవ పెళ్లి నిశ్చయమైన తర్వాత స్వరం మారింది. పవన్‌ పై పగ తీర్చుకునే కార్యక్రమానికి అభిమానులు తనపై చేసేన నెగిటివ్  కామెంట్స్‌ ని అడ్డుపెట్టుకుని మాటల దాడి పెంచింది రేణు దేశాయ్. ఈవ్యవహారానికి ముందులోనే అడ్డుకట్ట వేయాలని పవన్ వ్యూహాత్మకంగా రేణు దేశాయ్ మళ్ళీ పెళ్లి చేసుకుంటుంన్నందుకు ఓపెన్ గా అభినందనలు తెలిపినా రేణు కోపం చల్లారడం లేదు. 
కోరుకున్నది ఆయనే
దీనికితోడు రేణు దేశాయ్ ఈమధ్య తనతో విడాకులు ఆవ్వకముందే మరో స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకుని తండ్రి కూడా అయ్యాడని రేణు చేసిన తీవ్ర ఆరోపణలను ఆధారంగా చేసుకుని పవన్ పై బురద జల్లడానికి పవన్ వ్యతిరేక మీడియా విపరీతంగా కృషి చేస్తోంది. అయితే పవన్ మాత్రం ఈ విషయాలు ఏమి పట్టించుకోకుండా తన మౌనాన్ని కొనసాగిస్తూ ఈ విషయాల పై ఎటువంటి స్పందన ఇవ్వడంలేదు. 
Pawan Kalyan S Master Stroke
ఇలాంటి కీలక విషయాల పై పవన్ మౌనాన్ని కొనసాగిస్తే అది అతడి ప్రతిష్టకు భంగం కలిగేలా చేస్తుందని మెగా కాంపౌండ్ కు సన్నిహితంగా ఉండే కొంతమంది అభిప్రాయ పడుతున్నట్లు టాక్. అయితే ఈవిషయాలు పవన్ దృష్టి వరకు వచ్చినా ఈవిషయాల పై తాను స్పందించననీ ఇప్పుడు ఈవిషయాల పై తాను ఏమి మాట్లాడినా ఈవిషయానికి కొనసాగింపుగా మారుతుందని అందువల్ల మౌనమే సమాధానం అంటూ పవన్ తన సన్నిహితుల వద్ద కామెంట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో కూడ పవన్ తరుచు అనుసరించే మౌన వ్యూహం ఎంతవరకు మేలు జరుగుతుంది అనే అంతర్మధనంలో ప్రస్తుతం మెగా కాంపౌండ్ ఉన్నట్లు టాక్..    


మరింత సమాచారం తెలుసుకోండి: