ఏవిషయం పై అయినా నిర్మొహమాటంగా మాట్లాడే మంచులక్ష్మి త్వరలో విడుదల కాబోతున్న తన ‘వైఫ్ ఆఫ్ రామ్’ మూవీని ప్రమోట్ చేస్తూ ఈరోజు ఒకప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మనోజ్ విష్ణుల పై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. తనదృష్టిలో తన తమ్ముళ్ళు విష్ణు మనోజ్ లు తమతమ జీవితాలలో బాగా సక్సస్ అయ్యారు అంటూ కామెంట్స్ చేసింది మంచువారి అమ్మాయి.
lakshmi manchu wife of ram movie official teaser is out
తనదృష్టిలో సక్సస్ ఫెయిల్యూర్ అన్నది తలరాత పైన ఆధారపడి ఉంటుంది అని చెపుతూ తన తమ్ముళ్ళు ఇద్దరూ హీరోలుగా మంచిపేరు తెచ్చుకున్నారని ముఖ్యంగా మనోజ్ చేసిన సినిమాలు పరిశీలిస్తే అది మనోజ్ మాత్రమే చేయగలడు అని అనిపిస్తుందని షాకింగ్ కామెంట్స్ చేసింది. అంతేకాదు తనతమ్ముళ్ళు ఇద్దరు చేసిన సినిమాలకు ఇన్ని వందలకోట్లు వసూలు చేయాలి అన్న టార్గెట్ తో సినిమాలు చేయరనీ లైఫ్ అంతా ఆర్టిస్టుగా ఉండిపోవడం తన తమ్ముళ్ళకు ఇష్టం అంటూ అభిప్రాయపడింది మంచులక్ష్మి. 
Lakshmi Manchu Wife of Ram movie - Sakshi
ప్రస్తుతం విష్ణు తమ శ్రీవిద్యా నికేతన్ విద్యా సంస్థలను మాత్రమే కాకుండా మరో ఇంటర్నేషనల్ స్కూల్ ను నిర్వహిస్తున్న విషయాన్ని వివరిస్తూ తనతమ్ముళ్ళు ఇద్దరికీ సినిమాలుమాత్రమే ప్రధానం కాదు అంటూ మరో ట్విస్ట్ ఇచ్చింది. ఇదేసందర్భంలో తన మరోతమ్ముడు మనోజ్ గురించి మాట్లాడుతూ తనకు ఏదైనా సమస్య వస్తే దానిని ఎలా హ్యాండిల్ చేయాలో చెప్పగల అడ్వైజర్ మనోజ్ అని అంటూ తనకు అంత మంచి తమ్ముళ్ళు ఉండటం తన అదృష్టం అని అంటోంది. 

ఇదేసందర్భంలో తన సినిమా కెరియర్ గురించి మాట్లాడుతూ తన సమర్ధతకు రావలసిన గుర్తింపులో తనకు వన్ పర్సెంట్ గుర్తింపు కూడ రాలేదు అనిఅంటూ దీనివల్ల తనకు ఒకొక్కసారి అసహనం కలిగినా తాను ఎవరో తెలుసుకోవడం కోసం మెడిటేషన్ యోగా చేస్తూ ఉంటాను అంటూ కామెంట్స్ చేసింది. జీవితంలో ముఖ్యంగాసంసారాలలో ప్రతివ్యక్తికి ఎన్నో సమస్యలు ఉంటాయని అయితే బయట వ్యక్తుల గురించి వార్తలు వ్రాస్తే చదివేవాళ్ళు ఉండరు కాబట్టి సినిమా వాళ్ళ జీవితాల గురించి వారి సంసారాల గురించి వార్తలు రాయడం మీడియాకు ఫ్యాషన్ గా మారింది అంటూ మంచులక్ష్మి మీడియాను ఇన్ డైరెక్ట్ గా టార్గెట్ చేస్తోంది. లైఫ్ లో అనుకున్నది సాధించాలి అంటే పట్టుదల చాల ఉండాలి అనిఅంటూ సక్సస్ ఎవరికీ అంత సులువుగా రాదు అంటూ సక్సస్ మంత్రాను ఉపదేసిస్తోంది ఈమంచు వారి అమ్మాయి..  



మరింత సమాచారం తెలుసుకోండి: