పవన్ కళ్యాణ్ రాజకీయాల బాట పట్టి సినిమాలకు దూరం అయినా సినిమాలకు సంబంధించిన ఫంక్షన్స్ కు తరుచూ వస్తూ ఫిలిం ఇండస్ట్రీలో తన పట్టును కొనసాగిస్తున్నాడు. ఇలాంటి పరిస్థుతులలో పవన్ ఈవారం విడుదల కాబోతున్న చిన్న సినిమా ‘ఆటగదరా శివ’ సినిమాను ప్రమోట్ చేస్తూ ఆ సందర్భంలో తన ఆధ్యాత్మక గురువుకు సంబంధించిన ఒక షాకింగ్ నిజాన్ని బయట పెట్టాడు.
ఆటగదరా శివ
‘ఆ న‌లుగురు’ ‘మ‌ధు మాసం’ ‘అంద‌రి బంధువ‌య‌’ సినిమాలతో మంచి సెన్సిటివ్ దర్శకుడుగా పేరు తెచ్చుకున్న ‘ఆటగదరా శివ’ మూవీని భారీ సినిమాల నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ నిర్మిస్తున్నాడు. ఈ సందర్భంలో  ఈసినిమాలోని 'ఎట్టాగయ్యా శివ' అనే పాటను పవన్ కళ్యాణ్ తన ‘జనసేన’ ఆఫీసులో విడుదల చేసి ఈసినిమాతో తనకు ఉన్న సాన్నిహిత్యాన్ని వివరించాడు. 
జులై 20న విడుదల
ఈసినిమా హీరో ఉదయ శంకర్ తనకు చిన్నప్పటి నుంచి తెలుసు అని చెపుతూ అతడి తండ్రి   శ్రీరామ్ తనకు ఇంగ్లీష్ లెక్చరర్ మాత్రమే కాకుండా తనకు స్పిరుచువల్ గురువు అన్న విషయాన్ని బయట పెట్టాడు. అంతేకాదు తనకు ఆధ్యాత్మికత పై అభిరుచి ఏర్పడడానికి తన గురువు పాత్ర చాల ఎక్కువ అని చెపుతూ ఈసినిమా పై తన ప్రశంసలు కురిపించాడు. 
ఉరిశిక్ష నుంచి త‌ప్పించుకున్న ఖైదీ కథ
ఒక ఉరి శిక్ష పడిన ఖైదీ ఆ ఉరి నుంచి తప్పించుకోవడానికి జైలు నుండి పారిపోయిన పరిస్థుతులలో అనుకోకుండా త‌న‌ను ఉరితీయాల్సిన తలారినే క‌లుస్తాడు. వారిద్దరు పరస్పరం తెలియకపోవడంతో వారిద్దరు కలిసి ప్రయాణం చేసే పరిస్థుతులలో వారికి ఎదురయ్యే కొన్ని సంఘటనలను ఆశ్చర్యకరంగా తీర్చి దిద్దిన సినిమా ఇది. ఈమూవీ హీరో ఉదయ్ శంకర్ ఖైదీగా క‌నిపించాలని 11 నెల‌ల పాటు గ‌డ్డం, మీసాలు పెంచి చేసిన ప్రయత్నం ఇప్పటికే హాట్ టాపిక్ గా మారింది. ఈమధ్య కాలంలో ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన చిన్న సినిమాలు హిట్ అవుతున్న నేపధ్యంలో పవన్ హస్తవాసితో ఈమూవీ కూడ హిట్ అయితే పవన్ తన గురువు ఋణం తీర్చుకున్నాడనుకోవాలి..    



మరింత సమాచారం తెలుసుకోండి: