టాలీవుడ్ లోకి ఉయ్యాల జంపాల సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రాజ్ తరుణ్ తర్వాత కుమారి 21ఎఫ్, సినిమా చూపిస్త మావ,ఈడోరకం ఆడోరకం సినిమాలో మంచి విజయం అందుకున్నాడు.  హీరోగా మంచి ఫామ్ లోకి రాగానే రాజ్ తరుణ్ తన హీరోయిజం చూపించాడు. స్వయంకృతాపరాధాలు కావచ్చు, రాంగ్ గైడెన్స్ కావచ్చు, మొత్తంమీద చేసిన సినిమాలు అన్నీ బాక్సాఫీస్ దగ్గర పల్టీకొట్టాయి.  ప్రస్తుతం రాజ్ తరుణ్ ఇప్పుడు డౌన్ ఫాల్ లో వున్నాడు. పెద్ద బ్యానర్లు పిలిచినపుడు, కథ, డైరక్టర్ ముందు, బ్యానర్ కాదు, ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ నిర్లక్ష్యం చేసాడు.
Image result for dil raju
తనకు నచ్చిన వారికి, నచ్చిన కథతో, ఏదో ఒకటి చేసేసాడు. దాని ఫలితంగా అట్టర్ ఫ్లాప్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్నాడు.  ఇప్పుడు చేతిలో ఒక్క దిల్ రాజు 'లవర్' సినిమా మినహా మరోటిలేదు. అయితే ఈ సినిమా దిల్ రాజు ఏకంగా ఎనిమిది కోట్లు ఖర్చుచేయడం విశేషం.  అయితే రాజ్ తరుణ్ కి ఉన్న క్రేజ్ కి ఎనిమిది కోట్లు పెద్ద సాహసమే అని అంటున్నారు ఫిలిమ్ వర్గాలు. రాజ్ తరుణ్ రెమ్యూనిరేషన్, ప్యాడింగ్ ఆర్టిస్టులు, టెక్నికల్ టీమ్ అన్నీకలిపి 8 కోట్లకు డేకేసింది ఖర్చు. శాటిలైట్, డిజిటల్ ద్వారా నాలుగుకోట్లు రికవరీ వస్తోంది.
Image result for raj tarun lover poster
దాదాపు నాలుగు కోట్ల వరకు సినిమా థియేటర్లలో కలెక్షన్ల రూపంలో రావాల్సిందే. హీరో, హీరోయిన్లు ప్రేమించుకోవడం, హీరోయిన్ కు ఏదో ప్రమాదం, హీరో కాపాడే ప్రయత్నం చేయడం. ఇధే కనిపిస్తోంది ట్రయిలర్ లో. మరి ఇప్పుడు జనం రెగ్యులర్ ఫార్మాట్ సినిమాలు చూడడంలేదు. లవర్ ను ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.  ఒకవేళ పెట్టిన పెట్టుబడి రాకున్నా..సినిమా ఫ్లాప్ టాక్ వచ్చినా..మనోడి కెరీర్ కష్టాల్లో పడ్టట్లే అంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: